Begin typing your search above and press return to search.

సాహో: బ్రేక్ ఈవెన్ కు చాలా దూరం!

By:  Tupaki Desk   |   9 Sept 2019 2:46 PM IST
సాహో: బ్రేక్ ఈవెన్ కు చాలా దూరం!
X
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరక్కిన 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నాలుగు రోజులు 'సాహో' కలెక్షన్స్ భారీగా ఉన్నప్పటికీ ఐదవ రోజు మంగళవారం నుండి వసూళ్ళలో డ్రాప్ కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కలెక్షన్స్ మరింతగా డ్రాప్ కావడం తప్ప మెరుగుదల కనిపించడం లేదు.

'సాహో' హిందీ వెర్షన్ హిట్ అనిపించుకుంది కానీ మిగతా వెర్షన్లు అన్నీ బ్రేక్ ఈవెన్ మార్క్ కు చాలా దూరంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో 'సాహో' బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు రూ. 120 కోట్ల షేర్ కు పైగా సాధించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ 'సాహో' రూ. 80 కోట్ల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ కలెక్షన్ సాధించడం గొప్ప విషయమే .. కానీ 'సాహో' ను భారీ ధరలకు అమ్మడం జరిగింది కాబట్టి సినిమా మాత్రం హిట్ అనిపించుకోలేదు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తే మరో నలభై కోట్లు వసూలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఒక్క హిందీ వెర్షన్ తప్ప మిగతా ఓవర్సీస్ సహా అన్నీ ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కు దూరంగానే ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ సినిమా ఫలితంతో ప్రభాస్ అభిమానులకు ఊరటనిచ్చే విషయాలు రెండు. ఒకటి.. నెగెటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం. రెండవది హిందీలో హిట్ సాధించడం. అయితే తెలుగు వెర్షన్ కు మాత్రం నిరాశ తప్పేలా లేదు.