Begin typing your search above and press return to search.

సాహో పూర్తి కథ ఎవ్వరికి చెప్పలేదు

By:  Tupaki Desk   |   28 May 2018 12:24 PM IST
సాహో పూర్తి కథ ఎవ్వరికి చెప్పలేదు
X
బాహుబలి తరువాత ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ బడ్జెత్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ మాత్రం ఎక్కువ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. పైగా బాలీవుడ్ లో కూడా తెరకెక్కుతుండడంతో అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే సినిమాకు సంబందించిన అసలైన విషయాలను మాత్రం చిత్ర యూనిట్ కొంచెం కూడా బయటపెట్టడం లేదు.

ఇకపోతే సినిమాలో నటిస్తున్న సీనియర్ మలయాళం నటుడు లాల్ ఇటీవల అబుదాబి షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ తో దిగిన ఒక ఫొటోను రిలీజ్ చేస్తూ సినిమా గురించి కొన్ని విషయాలను చెప్పాడు. లాల్ వివరిస్తూ.. ఈ సినిమాను మొదట ఒప్పుకుంది కథను విని కాదు. ప్రభాస్ ఉన్నాడు అనగానే ఒప్పేసుకున్నా. ఈ సినిమాలో నాది ఒక పాజిటివ్ క్యారెక్టర్. ఇంతకంటే ఎక్కువగా చెప్పకూడదు.

ఇక సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ.. మొదట ఈ కథలో యాక్షన్ అంశాలను తెరకెక్కించి ఆ తరువాత మిగతా సన్నివేశాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే సినిమా కథను చిత్ర యూనిట్ ఏ ఒక్కరికి పూర్తిగా చెప్పలేదు. షూటింగ్ లో పాల్గొంటుంటే ఆ విషయం అర్థమవుతోందని లాల్ వివరించారు. అలాగే నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.