Begin typing your search above and press return to search.
సుజీత్ కి డెంగీ.. అందులో నిజం ఎంత?
By: Tupaki Desk | 8 Sep 2019 8:24 AM GMTసాహో రిలీజ్ ముందు ఎంతో ఉత్సాహంగా కనిపించిన సుజీత్ ప్రస్తుతం డెంగీ జ్వరంతో బాధపడుతున్నారని ఆస్పత్రిలో చేరారని ప్రచారమవుతోంది. శనివారం ఉదయం సుజీత్ ఆసుపత్రిలో చేరారని అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ప్రచారమైంది.
అయితే ఇది నిజమా అని విచారిస్తే.. సోషల్ మీడియాలో సాగుతున్నదంతా అసత్య ప్రచారమని తెలుస్తోంది. సుజీత్ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నారు. ఆరోగ్యంగానే ఉన్నారు. ఇటీవల సీజన్ మారింది. అందరికీ జ్వరాలు వస్తున్నాయి. సుజీత్ కి అలానే దగ్గు జ్వరం వచ్చింది అంతే. దానికి చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్యానికి వచ్చిన సమస్యేమీ లేదని తెలుస్తోంది. అయితే ఈలోగానే డెంగీ జ్వరం వచ్చిందని.. సాహో నెగెటివ్ ప్రచారంతో మానసిక వేదనకు గురయ్యాడని ప్రచారం అవుతోంది. 28 వయసులో అతడు సాహో లాంటి భారీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాల ఔట్ పుట్ తీసుకోవడంలో అద్భుత నైపుణ్యం చూపించాడు. మాస్ ప్రేక్షకులకు ఈ సన్నివేశాలు బాగా నచ్చాయి. ఒక సెక్షన్ విమర్శించినా.. కొందరు ఫ్యాన్స్ మాత్రం అతడిపై ప్రశంసలు కురిపించారు.
ఇక జ్వరం వస్తేనే ఇంత రాద్ధాంతమా? సెలబ్రిటీలు అయినంత మాత్రాన జ్వరం రాకూడదా? కొందరు నెటిజనులు దీనిపై ఎందుకింత హడావుడి చేస్తున్నారో తెలీని పరిస్థితి ఉంది. ఇంతకుముందు కింగ్ నాగార్జునకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ తరహాలోనే దుష్ప్రచారం జరగడంతో ఆయన హర్ట్ అయ్యారని ప్రచారమైంది. ఆ తర్వాత అక్కినేని అభిమానులకు తాను ఆరోగ్యంగానే ఉన్నానని సందేశం పంపారు. ఇకపోతే సుజీత్ కూడా తన ఆరోగ్యంపై నెటిజనులకు కాస్తంత ముందుగానే క్లారిటీనివ్వాల్సింది. అలా చేస్తే మిస్ అండర్ స్టాండింగ్ ఉండదేమో! అయినా డెంగీ జ్వరానికి చక్కని మెడిసిన్ అందుబాటులో ఉంది. మందులు తీసుకుంటూనే చక్కని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరం తగ్గడానికి బొప్పాయి తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.