Begin typing your search above and press return to search.

లూసిఫర్ తర్వాతే డైరెక్టర్ పెళ్లి.. నిజమేనా..?

By:  Tupaki Desk   |   13 Jun 2020 8:30 AM GMT
లూసిఫర్ తర్వాతే డైరెక్టర్ పెళ్లి.. నిజమేనా..?
X
'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. శర్వానంద్ హీరోగా రూపొందించిన తన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక చాలా గ్యాప్ తీసుకొని స్టార్ హీరో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ సాహో చేసాడు. ఇక సాహోతో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. సాహో తర్వాత మళ్లీ భారీ గ్యాప్ తీసుకొని తన తదుపరి సినిమా గురించి ప్రకటించాడు. ఇక సుజీత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం కూడా కానిచ్చేశాడు. సుజీత్ కొంతకాలంగా ప్రవల్లిక అనే డెంటిస్ట్ తో ప్రేమలో ఉన్నాడు. ఇక వీరి ప్రేమకు పెద్దలు కూడా ఓకే చెప్పడంతో కొద్దిమంది కుటుంబ సభ్యులు, పరిమితంగా బంధుమిత్రుల నడుమ ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

సుజీత్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్ చేసే చాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం అదే సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. షార్ట్ ఫిలింస్ తో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. తన రెండో సినిమా నుండే డార్లింగ్ ప్రభాస్.. మెగాస్టార్ చిరు లాంటి పెద్ద స్టార్లకు డైరెక్షన్ చేయడం పెద్ద విషయమే. అయితే ఈ కరోనా కాలంలో సినీ సెలబ్రిటీలంతా పెళ్లిళ్లు చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే లాక్ డౌన్ లో హీరో నిఖిల్.. నిర్మాత దిల్ రాజు.. ఇలా కొందరు పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ సుజీత్ మాత్రం మెగాస్టార్ తో లూసిఫర్ సినిమా పూర్తి చేసాక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదికూడా వచ్చే ఏడాది చేసుకుంటాడని సమాచారం. అయితే లూసిఫర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.