Begin typing your search above and press return to search.
ఓవర్సీస్: సాహో డిస్ట్రిబ్యూటర్ చేతికి సైరా
By: Tupaki Desk | 12 Sep 2019 8:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సహజంగా మెగాస్టార్ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సినిమా రిలీజ్ డేట్ కు చాలా ముందుగానే క్లోజ్ అవుతుంది. అయితే 'సైరా' కు మాత్రం కాస్త డిలే అయింది. అందులోనూ ఓవర్సీస్ రైట్స్ విషయంలో ఇంకా ఎక్కువ సమయం పట్టింది. దీనికి రెండు కారణాలు.. ఒకటి - ఓవర్సీస్ లో ఈమధ్య ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. రెండోది - 'సైరా' భారీ బడ్జెట్ చిత్రం కావడంతో భారీ రేట్లు కోట్ చేయడం జరిగిందని.. అందుకే డీల్ క్లోజ్ అయ్యేందుకు ఎక్కువసమయం పట్టిందని అంటున్నారు.
'సైరా' ఓవర్సీస్ హక్కులను రూ. 15 కోట్లకు ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ చేజిక్కించుకుందని సమాచారం. ఈ సంస్థ రీసెంట్ గా ప్రభాస్ సినిమా 'సాహో' ను కూడా ఓవర్సీస్ లో పంపిణీ చేసింది. గత రెండు మూడు రోజులుగా ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయిందనే విషయంపై మీడియాలో కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ జస్ట్ స్పెక్యులేషన్లు మాత్రమేని అంటున్నారు. ఈ డీల్ రికార్డ్ ప్రైస్ అని చెప్పలేం కానీ మెగాస్టార్ మార్కెట్ రేంజ్ కు తగినదేనని చెప్పాలి. మరి ఫార్స్ ఫిలిమ్స్ అమెరికాలో స్వయంగా రిలీజ్ చేస్తుందా లేదా మరో తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూటర్ ద్వారా ముందుకెళతారా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
చిరంజీవి లాస్ట్ సినిమా ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలు తడబడే ఓవర్సీస్ లో చిరు చిత్రం మంచి కలెక్షన్స్ నమోదు చేసింది. దీంతో గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ క్రేజ్ అలానే ఉందిని తేలిపోయింది.. ఇప్పుడు 'సైరా' ప్రోమోస్ ప్రామిసింగ్ గా ఉన్నాయి కాబట్టి మరోసారి ఓవర్సీస్ ఆడియన్స్ ను మెప్పించే అవకాశం లేకపోలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'సైరా' అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతోంది.