Begin typing your search above and press return to search.
సూర్య బందోబస్త్ కు సాహో కష్టాలు
By: Tupaki Desk | 20 July 2019 4:30 PM GMTతెలుగులో మార్కెట్ దారుణంగా పడిపోయి తమిళ్ లో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో నెట్టుకొస్తున్న సూర్య కొత్త సినిమా బందోబస్త్ విడుదల తేదీ కోసం కిందా మీదా పడుతోంది. ముందు దీనికి అనుకున్న తేది ఆగస్ట్ 15. అయితే సాహో దానికి ఫిక్స్ అయిపోవడంతో పోటీ పడితే వచ్చే నష్టం గుర్తించిన కాప్పన్(తమిళ్ బందోబస్త్ టైటిల్)నిర్మాతలు దాన్ని ఆగస్ట్ 30కి మార్చుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే సాహో వాయిదా పడి అదే ఆగస్ట్ 30ని బ్లాక్ చేసింది. ఏదైతే అయ్యింది అని సూర్య తెగించడానికి లేదు.
ఎందుకంటే పోటీకి వెళ్తే ఎక్కువ నష్టపోయేది సూర్యనే. క్లాష్ వచ్చిందంటే బందోబస్త్ తెలుగు వెర్షన్ అదే రోజు విడుదల చేయడం చాలా కష్టం. ఒకవేళ చేసినా ఓపెనింగ్స్ రావు. తమిళ్ లో సేఫ్ గా ఉంటుంది కానీ కేరళ కర్ణాటకలో ఇబ్బందులు తప్పవు. ఇంకా వాయిదా వేద్దామంటే ఇప్పటికే బయ్యర్ల నుంచి ఒత్తిడి వస్తోందట. ఇదే తరహా ఇబ్బంది గ్యాంగ్ లీడర్ కు వచ్చి పడింది. అయితే నాని ప్రొడ్యూసర్లు సెప్టెంబర్ 13 డేట్ వైపు చూస్తున్నారు.
చూస్తుంటే బందోబస్త్ కూడా ఇంచుమించు అదే డేట్ కు ఫిక్స్ అయ్యేలా ఉంది. అప్పుడు నానితో పోటీ తప్పదు. అదైనా ఇబ్బందే కానీ సాహోతో పోలిస్తే గ్యాంగ్ లీడర్ తో తలపడటం చాలా సేఫ్. కిచ్చ సుదీప్ పైల్వాన్ కూడా ఇదే తరహా స్ట్రాటజీతో ఉంది. ఒకవేళ మూడు తలపడినా ఆశ్చర్యం లేదు. దేనికవే విడివిడిగా ఆయా రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న సినిమాలు కావడంతో పోటీ పడితే పక్క స్టేట్ లో కలెక్షన్లు తగ్గే ప్రమాదం ఉంది. మొత్తానికి సాహో రెండు వారాల పోస్ట్ పోన్ మూడు నాలుగు సినిమాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది