Begin typing your search above and press return to search.

ఉత్తరాదిన ప్రభాస్‌ రికార్డుల మోత కంటిన్యూ

By:  Tupaki Desk   |   11 May 2020 8:50 AM GMT
ఉత్తరాదిన ప్రభాస్‌ రికార్డుల మోత కంటిన్యూ
X

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ ఉత్తరాదిన అనూహ్యమైన క్రేజ్‌ ను దక్కించుకున్నాడు. సౌత్‌ ఇండియాలో ఏ స్టార్‌ కు లేనంత స్టార్‌ డంను అక్కడ ప్రభాస్‌ దక్కించుకున్నాడు. బాహుబలి తర్వాత అది సాహో చిత్రంతో కంటిన్యూ అయ్యింది. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా హిందీ సినిమాలను మించిన వసూళ్లు నమోదు చేశాయి. ఇక సాహో చిత్రం సౌత్‌ లో కంటే అక్కడే ఎక్కువగా వసూళ్లు చేసిందనే విషయం తెల్సిందే. టీఆర్పీ రేటింగ్‌ విషయంలో కూడా ప్రభాస్‌ అక్కడ రికార్డుల మోత మ్రోగిస్తూనే ఉన్నాడు.

గత వారం బార్క్‌ విడుదల చేసిన టీఆర్పీ రేటింగ్‌ ల జాబితాలో ప్రభాస్‌ టాప్‌ లో నిలిచాడు. గత వారంలో ప్రముఖ ఛానెల్‌ లో ప్రసారం అయిన సాహో హిందీ వర్షన్‌ ఏకంగా 83.34 లక్షల ఇంప్రెషన్స్‌ తో నెం.1 స్థానం దక్కించుకుంది. అలాగే బాహుబలి చిత్రం కూడా గత వారం ప్రముఖ సోని మాక్స్‌ లో ప్రసారం అయ్యి భారీ రేటింగ్‌ దక్కించుకుని నెం.2 గా నిలిచింది. ప్రభాస్‌ చిత్రా తర్వాతే అక్షయ్‌ కుమార్‌ నటించిన హౌస్‌ ఫుల్‌ 4 చిత్రం(60.18 లక్షల ఇంప్రెషన్స్‌) నిలిచింది.

ప్రభాస్‌ సాహో మరియు బాహుబలి చిత్రాలతో పాటు రజినీకాంత్‌ దర్బార్‌ చిత్రం కూడా ఉత్తరాదిన భారీ ఇంప్రెషన్స్‌ ను దక్కించుకుంది. గత వారంలో వచ్చిన దర్బార్‌ చిత్రంకు 71.90 లక్షల ఇంప్రెషన్స్‌ దక్కాయి. గత వారం టాప్‌ చిత్రాల జాబితాలో మూడు చిత్రాలు సౌత్‌ స్టార్స్‌ నటించినవే కావడం విశేషం. ఈ రేటింగ్‌ తో ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో అక్కడ ఉందో చెప్పుకోవచ్చు. తెలుగులో ఏ స్టార్‌ హీరోకు స్థాయి క్రేజ్‌ ఉత్తరాదిన లేదు. ఈ విషయంలో టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కూడా ప్రభాస్‌ కు ఆమడ దూరంలో ఉన్నారని చెప్పుకోవచ్చు.