Begin typing your search above and press return to search.
సాహో టీజర్ .. అంత ఖర్చు చేసారా?
By: Tupaki Desk | 2 Jun 2019 4:26 PM GMT2019 మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. అయితే సాహో రిలీజ్ ముందు ప్రచారంలో ఎలాంటి గమ్మత్తయిన విషయాలు ఉంటాయో ఇంతవరకూ తెలియనేలేదు. ఇకపై టీజర్ - ట్రైలర్ అంటూ సాహో విజువల్ ట్రీట్ స్టార్ట్ కాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం... సాహో టీజర్ ని నభూతోనభవిష్యతి అన్న తీరుగా తీర్చిదిద్దనున్నారట. ఇంటర్నేషనల్ లెవల్ అనిపించేలా టీజర్ ని అద్భుతంగా తయారు చేస్తున్నారట. అందుకోసం ఏకంగా రూ.15లక్షలు ఖర్చు చేసి ఓ అద్భుతమైన ``హాలీవుడ్ మ్యూజిక్ బైట్`` రాయల్టీ హక్కుల్ని చేజిక్కించుకున్నారట. వాస్తవానికి టీజర్ కోసం వేరొక సంగీత దర్శకుడిని సంప్రదించినా .. దానికంటే మరింత క్వాలిటీ వర్క్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని తెలిసింది. టీజర్ అంటే కేవలం కొన్ని సెకన్లు లేదా 1-2 నిమిషాల్లో మెరిసేది. దానికోసం అంత ఖర్చు చేశారా? అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. టీజర్ చూశాక డిసైడైపోతారంతా. అందుకే ఇంత సాహసం చేస్తున్నారని తెలిసింది.
అయితే దాదాపు 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నప్పుడు టీజర్ కోసం ఆమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? అన్న వాదనా వినిపిస్తోంది. సాహో బ్రాండ్ న్యూ టీజర్ ని అభిమానులకు కానుకగా ఇవ్వాలన్నది ప్లాన్. అందుకోసమే ఈ తపన అంతా. ఆ మేరకు ప్రభాస్ - సుజీత్- యువి క్రియేషన్స్ బృందం పక్కాగా ప్లాన్ చేసిందిట. సాహో ప్రమోషన్ ని `భారత్` సినిమా ఆడే థియేటర్లలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సాహో టీజర్ ని సల్మాన్ భాయ్ సినిమాతో రిలీజ్ చేసి మైలేజ్ పెంచాలని చూస్తున్నారు. జూన్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఉండనుంది. అప్పటివరకూ కాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే.