Begin typing your search above and press return to search.

నెగెటివ్ టాక్ ను పట్టించుకోని హిందీ ఆడియన్స్!

By:  Tupaki Desk   |   1 Sept 2019 3:36 PM IST
నెగెటివ్ టాక్ ను పట్టించుకోని హిందీ ఆడియన్స్!
X
భారీ అంచనాల నడుమ విడుదలైన 'సాహో' కు నెగెటివ్ రివ్యూస్.. మిక్స్డ్ టాక్ వచ్చిన సనగతి తెలిసిందే. 'బాహుబలి 2' కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేయగల చిత్రంగా అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలు అందుకోవడంలో 'సాహో' విఫలమైంది. అయితే హిందీ బెల్ట్ లో మాత్రం 'సాహో' కు భారీ ఆదరణ దక్కుతుండడం విశేషం.

మొదటి రోజు 'సాహో' హిందీ వెర్షన్ రూ.24 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అయితే టాప్ రివ్యూయర్స్ అయిన తరణ్ ఆదర్శ్ లాంటివారు చాలామంది నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడంతో సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అనుకున్నారు. కానీ రెండో రోజు కూడా 'సాహో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. రెండవ రోజు హిందీ వెర్షన్ రూ. 23 కోట్ల రూపాయల నెట్ వసూళ్ళను సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ లెక్కన మొదటి వీకెండ్ లో 'సాహో' హిందీ వెర్షన్ వసూళ్లు రూ.70 కోట్ల మార్క్ ను టచ్ చేయడం సులువే. ఇదేమీ సాధారణమైన విషయం కాదు.

దీన్ని బట్టి చూస్తే హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ ఏర్పడిన విషయం అర్థం అవుతుంది. సినిమాకు నెగెటివ్ టాక్ ఉంటేనే ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అంటే.. ఒకవేళ సినిమా కొంచెం బాగున్నా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి ఉండేదని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఏదేమైనా ప్రభాస్ క్రేజ్ ను 'సాహో' కొంతమేర డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.