Begin typing your search above and press return to search.
సాహో దెబ్బకు సైరా వద్దంటున్నారు
By: Tupaki Desk | 8 Sep 2019 4:26 AM GMTసాహో సినిమా బాగా ఆడాలని సైరా టీం గట్టిగా కోరుకుని ఉంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దీన్ని కూడా సాహో తరహాలోనే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హిందీ - తమిళం - మలయాళం - కన్నడ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు - కర్ణాటక వరకు ఈ చిత్రానికి ఢోకా లేదు. బిజినెస్ భారీగానే జరుగుతోంది. కానీ మిగతా చోట్ల ఆశాజనకంగా లేదు. బిజినెస్ ఆఫర్లు కోరుకున్నట్లుగా లేవు. సాహో సినిమా హిందీలో బాగా ఆడినా.. చిరంజీవికి అక్కడ చెప్పుకోదగ్గ పేరు - గుర్తింపు లేవు. ఎప్పుడో 90ల్లో ఒకట్రెండు సినిమాలు చేశాడు కానీ.. ఆ తర్వాత అటు వైపు చూడలేదు. ఆల్రెడీ హిందీ డీల్ పూర్తయింది కానీ.. అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారని.. ఎంత మొత్తం చెల్లించాలనే విషయంలో వేచి చూస్తున్నారని సమాచారం.
అనిల్ తడాని - ఫర్హాన్ అక్తర్ లాంటి వాళ్లు ఈ సినిమాను ఉత్తరాదిన రిలీజ్ చేయడమే భాగ్యం అన్నట్లుగా ఉంది సైరా టీం ఆలోచన. ఇక డిమాండ్ చేసి ఇంత కావాలని అడిగే పరిస్థితి ఎంత మాత్రం లేదు. మరోవైపు సాహో సినిమా తమిళం - మలయాళంలో పెద్ద డిజాస్టర్ కావడంతో సైరాకు చిక్కొచ్చి పడింది. ఇక్కడ నిర్మాత రామ్ చరణ్ ఆశించిన రేటు ఎంతమాత్రం దక్కేలా లేదు. ఆ రెండు చోట్లా సినిమాను చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజ్ చేయడమే కష్టమయ్యేలా ఉంది. మరీ తక్కువ మొత్తాలకు సినిమాను అడుగుతున్నారట. ఐతే అల్లు అరవింద్ తనకున్న పరిచయాలతో ఓ మోస్తరుగా డీల్ సెట్ చేసి.. ఈ రెండు రాష్ట్రాల్లో సినిమా సరిగా రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.