Begin typing your search above and press return to search.

సైరా మీద సాహో దెబ్బ?

By:  Tupaki Desk   |   17 Sep 2019 1:30 AM GMT
సైరా మీద సాహో దెబ్బ?
X
తక్కువ గ్యాప్ లో రెండు ప్రెస్టీజియస్ సినిమాలు వస్తే పరస్పర ప్రభావం ఉండటం సహజం. అందులోనూ మొదటిది డిజాస్టర్ అయితే దాని తాలూకు ఎఫెక్ట్ తప్పకుండా రెండో దాని మీద ఉంటుంది. హీరోలు దర్శకులు వేరైనా ట్రేడ్ లెక్కల్లో ఒకరకమైన భయం ఉంటుంది. ఇప్పుడు సాహో వల్ల సైరా ఇలాంటి ఇబ్బందే పడుతున్నట్టుగా కనిపిస్తోంది. భారీ అంచనాలతో మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందినట్టుగా చెప్పుకున్న సాహో కేవలం వారం లోపే బాగా స్లో అయిపోయి నష్టాల బాట పట్టింది.

పెట్టుబడి దారులు నష్టాలు చవి చూడటం ఖాయమని తేలిపోయింది. అది ఎంత మొత్తంలో అనేది ఫైనల్ రన్ పూర్తయ్యాక కాని క్లారిటీ రాదు. ఈలోగానే సైరా హడావిడి మొదలైంది. బడ్జెట్ ప్లస్ హైప్ విషయంలో సాహోకు ఏ మాత్రం తీసిపోని రీతిలో దీని మీద అంచనాలు ఉన్నాయి. కాని ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ డేట్ ప్రకటించినా ఆశించిన జోష్ బయట కనిపించడం లేదు. దీనికి సాహో రిజల్ట్ కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. కొణిదెల టీం కూడా ప్రమోషన్ విషయంలో ఏమంత దూకుడుగా లేదు.

విడుదలకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నా దానికి తగ్గ హైప్ క్రియేట్ చేయడంలో కాస్త తాత్సార్యం చేస్తోంది. ఇదంతా కొంత ప్రతికూలంగా మారుతోంది. అసలే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా బయ్యర్లు సైరా మీద సైతం పెద్ద గేమ్ కు సిద్ధపడ్డారు. ఇప్పటికె ఏరియాల వారిగా క్రేజీ రేట్లకు బిజినెస్ జరుగుతోంది. సాహో ఫలితం రిపీట్ కాకుండా సైరా కొత్త చరిత్ర సృష్టించాలని అభిమానులతో పాటు కొనుగోలుదారులు సైతం కోరుతున్నారు.