Begin typing your search above and press return to search.

శాటిలైట్ అమ్మ‌కుండా త‌ప్పు చేశారా?

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:19 AM GMT
శాటిలైట్ అమ్మ‌కుండా త‌ప్పు చేశారా?
X
హిట్టును న‌మ్మే సెంటిమెంటు ప‌రిశ్ర‌మ ఇది. ఇలాంటి చోట ఆ ఒక్క‌టీ తేడా కొడితే ఎంత పెద్ద హీరోకి అయినా ఇబ్బందులు త‌ప్ప‌వు. హిట్టొస్తేనే అన్ని ర‌కాలుగా బిజినెస్ బావుంటుంది. ఫ్లాపైతే క‌నీసం శాటిలైట్ బిజినెస్ కూడా ఉండదు. ఒక్కోసారి అత్యుత్సాహంలో భారీగా ధ‌ర‌లు కోట్ చేసినా ఆ త‌ర్వాత బుక్క‌యిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఇలాంటి స‌న్నివేశ‌మే ఎదురైంద‌ట `సాహో` నిర్మాత‌ల‌కు.

2019 ఆగ‌స్టు 30న రిలీజైంది సాహో. రిలీజ్ ముందే డిజిట‌ల్ స‌హా శాటిలైట్ రైట్స్ బిజినెస్ ని పూర్తి చేశారు. అమెజాన్ ప్రైమ్ కి డిజిట‌ల్ రైట్స్ విక్ర‌యించిన టీమ్ .. హిందీ శాటిలైట్ రైట్స్ ని జీ గ్రూప్ కి అమ్మేసింది. కానీ ఎందుక‌నో తెలుగు శాటిలైట్ రైట్స్ మాత్రం త‌మ వ‌ద్ద‌నే ఉంచుకున్నారు. తాము కోట్ చేసిన 90 కోట్ల రేంజుకు ఎవ‌రూ స‌రితూగ‌క‌పోవ‌డంతో ఆ బిజినెస్ పూర్త‌వ్వ‌లేదు.

తీరా సినిమా రిలీజ‌య్యాక ఫ్లాప్ టాక్ రావడంతో ఆ ప్ర‌భావం తెలుగు శాటిలైట్ రైట్స్ పై ప‌డింద‌ట‌. దీంతో ఇక్క‌డ కొనేందుకు సిద్ధ‌మైన జెమినీ సైతం వెన‌క్కి త‌గ్గింద‌ని తెలుస్తోంది. ఇక ఎవ‌రూ కొన‌లేదు క‌దా! అని రైట్స్ కోసం కోట్ చేసిన ధ‌ర ఏమైనా త‌గ్గించారా? అందుకు స‌సేమిరా అంటున్నార‌ట‌. కార‌ణం ఏదైనా సాహో తెలుగు శాటిలైట్ రైట్స్ ప్ర‌స్తుతానికి అమ్ముడ‌వ్వ‌లేదు. ఇక ఇప్ప‌టికే డిజిట‌ల్ స్ట్రీమింగ్ వేదిక‌ స‌హా పైర‌సీలోనూ ఈ చిత్రాన్ని జ‌నం చూసేశారు. అంతేకాదు రిలీజ్ టెన్ష‌న్ లోనూ తెలుగు శాటిలైట్ గురించి ఆలోచించే స‌మ‌యం లేక‌పోవ‌డం.. థియేట్రిక‌ల్ బిజినెస్ హ‌డావుడిలోనూ దాన్ని లైట్ తీస్కోవ‌డం కూడా ఇందుకు కార‌ణ‌మైంద‌ని తెలుస్తోంది. అన్న‌ట్టు ప్ర‌తి అగ్ర నిర్మాణ సంస్థ సొంతంగా ఒక ఓటీటీ వేదిక‌ను రెడీ చేసుకుని అక్క‌డ ప్ర‌తిభ‌కు అవ‌కాశాలివ్వ‌డ‌మే గాక‌.. ఆ వేదిక‌పై త‌మ సినిమాల్ని కూడా ప్ర‌మోట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ స‌హా ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది. మ‌రి యువి క్రియేష‌న్స్ సంస్థ అలాంటి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌డం లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.