Begin typing your search above and press return to search.

సాహో కథ ఇంత అతుకుల బొంతనా!

By:  Tupaki Desk   |   3 Sep 2019 1:30 AM GMT
సాహో కథ ఇంత అతుకుల బొంతనా!
X
లాంగ్ వీకెండ్ పుణ్యమాని సాహో వసూళ్లు అదిరిపోతున్నాయి కాని టాక్ లో మాత్రం ఏ మెరుగుదల లేదు. ముఖ్యంగా మొదటి మూడు రోజులకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ అన్ని ఫుల్ గా జరిగిపోయాయి కాబట్టి అర్బన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ లోటు లేకుండా జరిగిపోతున్నాయి. బిసి సెంటర్స్ లోనే పరిస్థితి కాస్త అటుఇటుగా ఉంది. ఇదిలా ఉండగా సాహో కథ గురించిన లొల్లి మాత్రం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు.

లార్గో వించ్ ని ఇంతకు ముందే అజ్ఞాతవాసిగా తీస్తే మళ్ళి దాన్నే సాహోగా ఫ్రీమెక్ చేసారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ క్లారిటీ ఇవ్వడానికి టీం మెంబర్స్ ఎవరూ వెంటనే అందుబాటులోకి రావడం లేదు. ఒకవేళ వచ్చినా దీని గురించి నేరుగా ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. వాస్తవానికి సాహో గురించి మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అని ఊరించినప్పుడు రకరకాల అంచనాలు రేగడం సహజం.

కాని ఇంతకు ముందు పూరి వర్మ లాంటి దర్శకులు ఎప్పుడో వాడి పారేసిన పాత మాఫియా కం అండర్ కవర్ పోలీస్ కథనే తీసుకుని సుజిత్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం చేసుకోవడం కష్టమే. కథలో కొత్తదనం ఉందా అంటే అది లేదు. అలా అని ప్రేక్షకుల విచక్షణను తక్కువ అంచనా వేస్తే ఎలా. ఇంట్రోనేమో చిరంజీవి చూడాలని ఉంది టైపులో మాఫియా బ్యాక్ డ్రాప్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ స్టైల్ లో పాత్రలేమో ఇప్పటికే వందలాది బాలీవుడ్ సినిమాల ఫార్మాట్ లో ఇలా మొత్తం నాలుగు అతుకులను తీసుకుని బొంతలా సాహో కథ రాసుకున్నారేమో అనే అనుమానం రాక మానదు. ఇకనైనా బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యమని గుర్తిస్తే ఖరీదైన తప్పులు జరగకుండా ఉంటాయి