Begin typing your search above and press return to search.
నిన్నటి వరకూ ఎరుపు.. నేడు మాత్రం పచ్చ
By: Tupaki Desk | 31 Aug 2019 5:30 AM GMTఈ మధ్యకాలంలో భారీ బజ్ తో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ప్రముఖంగా చెప్పేది సాహో. సుదీర్ఘకాలం పాటు ప్రొడక్షన్ చేయటం.. సినిమా మీద భారీ అంచనాలు నెలకొనటమే కాదు.. తెలుగు సినిమాకు సంబంధించి ఇంత బడ్జెట్టా? అన్న క్వశ్చన్ మదిలో మెదిలేలా చేసిన చిత్రంగా సాహో ను చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే సాహో సినిమాతో తెలుగు సినిమా మేకింగ్ విషయంలోనూ పెను మార్పులకు కారణమైంది.
సరిగ్గా తీయాలే కానీ తెలుగు సినిమాకు మిగిలిన భాషల్లోనూ ఆదరణ ఉంటుందని నిరూపించిన చిత్రం బాహుబలి. అలాంటి సినిమాలో ప్రధానభూమిక పోషించిన ప్రభాస్ ఇమేజ్ తో తీసిన సాహో చిత్రం మీద ఉన్న బజ్ భారీ రిలీజ్ కు కారణమైంది. సాహో ప్రీ బుకింగ్స్ ను వారం ముందు నుంచే మొదలెట్టారు. ఈ సినిమా మీద ఉన్న అంచనాల కారణంగా.. రిలీజ్ రోజునే కాదు.. ఆదివారం వరకూ సినిమా టికెట్లు లభించని పరిస్థితి.
ఆన్ లైన్లో ఏ థియేటర్ చూసినా.. ఏ షో చూసినా ఎరుపు తప్పించి మరే రంగు కనిపించని పరిస్థితి. అయితే.. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. బుధవారం నాటికే సాహో ప్రీ బుకింగ్స్ ను ఆన్ లైన్ లో చూస్తే.. ప్రతి థియేటర్ లోనూ మంగళవారం వరకూ టికెట్లు దొరకని పరిస్థితి. శుక్రవారం రిలీజ్.. శని.. ఆదివారాల్లో వీకెండ్ జోష్ తో పాటు.. సోమవారం వినాయకచవితి ఉండటంతో టికెట్లు మొత్తం ఫుల్ అయినట్లుగా ఆన్ లైన్లో కనిపించాయి.
టికెట్ల కోసం ఏ షో చూసినా.. రెడ్ కలర్ కనిపిస్తూ.. సినిమా చూడాలనుకునే వారికి నిరాశ కలిగించింది. అనూహ్యంగా సాహో టాక్ డిజాస్టర్ అన్న మాట వైరల్ గా మారటమే కాదు..ఆన్ లైన్ టికెట్ల మీదా దాని ప్రభావం భారీగా కనిపించింది. సోమవారం వరకూ రెడ్ కలర్ లో కనిపించిన బుకింగ్ స్టేటస్ కాస్తా.. ఇప్పుడు ఒక్కసారిగా గ్రీన్ కలర్ లోకి వచ్చేయటం విశేషం. మధ్యాహ్నం..సాయంత్రం షోలకు తప్పించి మిగిలిన అన్ని షోలకు ఇవాల్టి నుంచే టికెట్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో.. నిన్నటి దాకా తాము ఎంతగానో వేచి చూసిన సినిమాను వెంటనే చూడలేకపోతున్నామనే నిరాశను కలిగించిన రెడ్.. ఇప్పుడు గ్రీన్ లోకి మారి మరింత ఆందోళన కలిగించటం విశేషం. విడుదలైన రెండో రోజునే టికెట్లు ఉన్నట్లు కనిపించటం చూస్తే.. సాహో కలెక్షన్ల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.