Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో సాహో కలెక్షన్స్ ఇలా..

By:  Tupaki Desk   |   2 Sept 2019 3:06 PM IST
ఓవర్సీస్ లో సాహో కలెక్షన్స్ ఇలా..
X
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్.. రివ్యూస్ నెగెటివ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్ ఫిగర్స్ మాత్రం డీసెంట్ గానే ఉన్నాయి. నార్త్ లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. అయితే అమెరికాలో మాత్రం కలెక్షన్స్ ట్రెండ్ భారీగా లేదు. జస్ట్ డీసెంట్ అని మాత్రమే చెప్పాలి. అమెరికాలో మొదటి వారాంతంలో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఇవే.

ప్రీమియర్స్: $915K

శుక్రవారం: $545k

శనివారం: $493k

ఆదివారం: $400k

ఫస్ట్ వీకెండ్ టోటల్: $2.45 మిలియన్

ప్రీమియర్ కలెక్షన్స్ లో 'అజ్ఞాతవాసి'.. 'స్పైడర్' వంటి చిత్రాలను 'సాహో' దాటలేకపోయింది. ఆ విషయంలో నిరాశపరిచినా శుక్రవారం నుండి 'సాహో' కలెక్షన్స్ స్టడీగానే కొనసాగుతున్నాయి. అమెరికాలో $2.45 మిలియన్ వసూలు చేసిన సాహో ఇతర ఓవర్సీస్ ఎరియాలనుండి ఇంకో 800K డాలర్స్ వసూలు చేసింది. 'సాహో' ను ఓవర్సీస్ లో రూ. 42 కోట్లకు అమ్మడం జరిగింది. దీంతో బ్రేకీవెన్ మార్క్ చేరాలంటే 'సాహో' కలెక్షన్స్ మరి కొన్ని రోజులు స్టడీగా ఉండాలి. ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి చూస్తే మాత్రం ఓవర్సీస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ చేయడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.