Begin typing your search above and press return to search.
సాహో దుబాయ్ రివ్యూ వచ్చేసింది
By: Tupaki Desk | 26 Aug 2019 8:11 AM GMT300 కోట్ల దాకా పెట్టుబడి. రెండేళ్లకు పైగా నిర్మాణం. ఆరేళ్ళకు పైగా సాగిన దర్శకుడి నిరీక్షణ. నాలుగు భాషల్లో కనివిని ఎరుగని భారీ విడుదల. ఓపెనింగ్స్ మీద ఇప్పటికే ట్రేడ్ తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తర్వాత దీని మీద అన్ని అంచనాలు పెట్టుకున్నారు. సాహో గురించి వర్ణించడానికి ఈ ఉపమానాలు సరిపోవేమో. ఆ రేంజ్ లో ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ టికెట్లు హాట్ కేక్స్ కంటే వేగంగా అమ్ముడవుతుండగా ప్రతి స్క్రీన్ లోనూ నిముషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. నాలుగు రోజుల ముందే పరిస్థితి ఇలా వుంటే ఇక 30న జరగబోయే అరాచకం గురించి చెప్పేదేముంది.
ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ కం సెన్సార్ బోర్డు మెంబెర్ ఉమైర్ సంధు పెట్టిన ట్వీట్స్ ఫ్యాన్స్ ఆనందంతో తడిసిముద్దయ్యేలా ఉన్నాయి. మొత్తం మూడు ట్వీట్లు పెట్టిన ఉమైర్ సాహో గురించి మాములుగా వర్ణించలేదు. మొదటిదాంట్లో "సాహో మొదటి సగం మీ మతులు పోగొడుతుంది. పైసా వసూల్ సినిమా. ఛేజులు యాక్షన్ సీక్వెన్సులకు గూస్ బంప్స్ ఖాయం. టికెట్ డబ్బులు ప్రభాస్ ఎంట్రీతోనే గిట్టుబాటు అయిపోతాయి" రెండో ట్వీట్లో "ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ప్రభాస్ ని చూడటం ఒక గొప్ప మాస్టర్ స్ట్రోక్. ఇంకే నటుడిని ఇంత కూల్ గా దొంగతనాలు చేసే పాత్రలో ఊహించుకోలేం".
మూడో ట్వీట్లో "మొత్తంగా చెప్పాలంటే సాహో గొప్ప సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ప్రభాస్ ఇరగదీశాడు. ఇంకా ఇంకా కావాలి అనే రేంజ్ లో టన్నుల కొద్దీ వినోదం ఇందులో ఫ్యాన్స్ కి ఇచ్చారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ తక్కువ స్థాయిని సాహో అందుకునే ఛాన్స్ లేదు". చూసారుగా. చదువుతుంటేనే ఓ రేంజ్ లో ఎలివేషన్లు వస్తున్నాయి. ఇక రేపు థియేటర్లో జరగబోయే రచ్చ ఊహించుకుంటే నాలుగు రోజులు వెయిట్ చేయడం చాలా భారంగా అనిపిస్తోంది కదూ. తప్పదు మరి