Begin typing your search above and press return to search.
హడావిడి వల్లే సాహోకు డ్యామేజా ?
By: Tupaki Desk | 1 Aug 2019 5:22 AM GMTఅసలే ఇది టెక్నాలజీ ప్రపంచం. ఒకప్పుడు సినిమా కథలు పాటలు కాపీ కొట్టినా స్ఫూర్తి తీసుకున్నా జనం పెద్దగా పట్టించుకునే వారు కాదు. దానికి కారణం ప్రపంచ వినోదం అందుబాటులో లేకపోవడంతో పాటు అది పూర్తి ఖరీదు కావడం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. గూగుల్ తల్లిని అడిగితే చాలు క్షణాల్లో కోరుకున్నది స్మార్ట్ ఫోన్ లో ల్యాప్ టాప్ లో ప్రత్యక్షమవుతోంది. అందుకే దర్శక నిర్మాతలు ఈ విషయంగా చాలా జాగ్రత్తగా ఉంటూ ఖర్చు అవుతున్నా ఎక్కడో ఉండే కొరియన్ నిర్మాతలను సంప్రదించి హక్కులు కొంటున్నారు. కథకు సంబంధించి ఇదంతా బయటపడేది సినిమా విడుదలయ్యాకే.
కానీ సంగీతం విషయం వేరు. చాలా ముందుగానే ఆడియో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ట్యూన్ ని పాటలో సాహిత్యాన్ని కాచి వడబోసి మరీ అది ఎక్కడి నుంచి తెచ్చారు ఎంతవరకు కాపీ కొట్టారు అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. మొన్న విడుదల చేసిన సాహో కొత్త సాంగ్ టీజర్ ఏ చోట నువ్వున్నాకు సైతం ఈ బెడద తప్పలేదు. ఓ ఇంగ్లీష్ పాప్ ఆల్బమ్ లోని డోంట్ గో అవేకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.
ఇంకేముంది రచ్చ షురూ. బాలీవుడ్ కంపోజర్ గురు రంద్వాన ట్యూన్ చేసిన ఈ గీతం బాగానే ఉందనిపించినప్పటికీ ఇప్పుడీ టాక్ ద్వారా మరో మరక వచ్చి పడింది. నిజానికి ఇలా పోస్టర్లు పాటల మీద కాపీ గోల రావడానికి కారణం సాహో టీమ్ షూటింగ్ ఆఖరి రోజుల్లో పడుతున్న హడావిడేనని అంటున్న వారు లేకపోలేదు. కాస్త ప్లాన్డ్ గా ఏడాది క్రితమే సంగీతానికి సంబంధించిన కంపోజింగ్ రికార్డింగ్ పూర్తి చేసుకుని ఉంటే ఇప్పుడీ మాటలు పడాల్సి వచ్చేది కాదు కదా అనేది వాళ్ళ వెర్షన్. దీంట్లో అయితే ఒప్పుకోవాల్సిన లాజిక్ ఉంది