Begin typing your search above and press return to search.

సాహో తక్షణ కర్తవ్యం ఏమిటి ?

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:47 AM GMT
సాహో తక్షణ కర్తవ్యం ఏమిటి ?
X
అర్జెంట్ గా సాహో ప్రమోషనల్ స్ట్రాటజీ మార్చాలి. ఇది మేమంటున్న మాట కాదు. స్వయానా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మనసులో కోరుకుంటున్నది. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న తమ హీరో సినిమా మీద బజ్ అప్ అండ్ డౌన్ అవుతుండటం వాళ్లకు ఏ మాత్రం నచ్చడం లేదు. వదులుతున్న పోస్టర్లు ఏవి కూడా ఎగ్జైట్ మెంట్ ఇవ్వలేకపోవడం గాయం మీద కారం చల్లినట్టు అవుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే శంకర్ ఎహసాన్ లాయ్ లు తప్పుకోవడం అసలు ట్విస్టు. రెండేళ్లు సైలెంట్ గా ఉండి విడుదలకు ఇంకో రెండున్నర నెలలు మాత్రమే టైం ఉన్నప్పుడు ఇలా కావడం వెనుక అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వాళ్ళు మనకు సింక్ అవ్వరు అనుకుంటే అది ముందే గుర్తించి వేరే ఆప్షన్ చూసుకోవాలి కానీ ఇక్కడి దాకా తేవడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం నిర్మాతలకె తెలియాలి

ఇంత జరిగినా యువి సంస్థ ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. సంగీత దర్శకుడి రీ ప్లేస్ మెంట్ గురించి ఎలాంటి ప్రకటన లేదు. పోనీ ఏదైనా టీజర్ ప్లాన్ చేశారా అంటే ఇంకా టైం ఉంది కదా అనే తరహాలో నింపాదిగా ఉన్నారు. ఇంకో 75 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో సాహో టీమ్ వేగం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో తేడా కొడుతుందన్న కామెంట్స్ కు సమాధానం ఇవ్వాలి అంటే స్ట్రాంగ్ మెటీరియల్ ని జనంలోకి వదలాలి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా బాలన్స్ ఉన్నకారణం గా సాహో మేకర్స్ ఎప్పటి నుంచి వీటి మీద దృష్టి సారిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. వేచి చూడటం తప్ప ఎవరు ఏమి చేయలేని పరిస్థితి.