Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాకు సాహో - ట్రైలర్ టాక్
By: Tupaki Desk | 10 Aug 2019 11:36 AM GMTటాలీవుడ్ లో బాహుబలి తర్వాత అంత ఖర్చు - క్రేజు రాబట్టుకున్న చిత్రంగా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న సాహో ట్రైలర్ లాంచ్ ఇందాక ముంబైలో ఘనంగా జరిగింది. ఇది ముందే తెలిసిన న్యూస్ కాబట్టి అభిమానులు దీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రెండు రోజుల నుంచి కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూశారు. మరి ఇంతగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తూ ఊరిస్తూ వచ్చిన ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ట్రైలర్ విషయానికి వస్తే ముంబైలో అనూహ్య రీతిలో రెండు వేల కోట్ల రాబరీ జరుగుతుంది. ఇది ఎవరు చేశారో అర్థం కాక దీన్ని చేధించేందుకు ఒక అండర్ కవర్ కాప్(ప్రభాస్)ని రెడీ చేస్తారు. అరాచకానికి మారుపేరుగా ఉండే అతను ఫీల్డ్ లోకి దిగాక క్రైమ్ బ్రాంచ్ లో ఉండే ఆఫీసర్(శ్రద్ధా కపూర్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఈలోగా మాఫియా డాన్(నీల్ నితీష్)నుంచి ఆర్జె సిటీలో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే రహస్యాలు ఉన్న బ్లాక్ బాక్స్ తెచ్చే టాస్క్ ని డార్లింగ్ కే అప్పగిస్తాడు. అప్పటికే ఎందరో కరుడు కట్టిన డాన్లు ఎందరో దాని మీద కన్ను వేస్తారు. ఇంత ప్రమాదకరమైన మిషన్ నుంచి సాహో ఎలా గట్టెక్కాడు ఆ చోరీకి ఇతనికి ముడి ఏంటి లాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలు తెరమీద చూడాల్సిందే
ప్రభాస్ ఊహించిన దానికన్నా మతిపోగొట్టే మేచో లుక్స్ తో అదరగొట్టేశాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇటు లవ్ టచ్ ఉన్న సీన్స్ లోనూ తనదైన ప్రెజెన్స్ తో సాహోరే అనిపించేశాడు. ఒక్కసారి చూస్తే చాలు రాత్రి కలలోకొచ్చే భీకరమైన గూండాలను ఎదురుకోవాలంటే కావాల్సిన మగతనం ఉన్న వీరుడిగా డార్లింగ్ గురించి వర్ణించాలంటే అదరహో అనే పదం సరిపోదు. శ్రద్ధా కపూర్ రెగ్యులర్ హీరోయిన్ గా కాక హీరోతో పాటు ట్రావెల్ చేస్తూ తనవల్లే కథ మలుపు తిరిగే పాత్రలో బాగా మ్యాచ్ అయ్యింది. మురళి శర్మ- మహేష్ మంజ్రేకర్ - నీల్ నితీష్ - అరుణ్ విజయ్ అందరికి ఒక్కో షాట్ లో చూపించేసి వయొలెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోందో శాంపుల్ చూపించారు
జిబ్రాన్ సంగీతం సాహో ట్రైలర్ స్థాయిని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. కమల్ కన్నన్ స్పెషల్ ఎఫెక్ట్స్ రెండు నిమిషాల వీడియోలోనే అబ్బురపరిస్తే రేపు సినిమా మొత్తంలో ఏ రేంజ్ లో ఉంటాయో ఊహకందటం లేదు. డైలాగ్స్ క్యాచీగా ఉండటం విశేషం. గల్లీలో కాదు స్టేడియం లో సిక్సు కొట్టేవాడిదే రేంజ్ ఉంటుంది లాంటి పంచులు పేలాయి. మాదీ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక సాహోకు ప్రధాన బలంగా నిలుస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం మాములుగా లేవు. కెన్నీ బేట్స్ బృందం రామ్ లక్ష్మణ్ ల సాహసాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. మేకింగ్ కు ఇంత కాలం ఎందుకు పట్టిందో అర్థం కావాలి అంటే ఈ 166 సెకండ్ల వీడియో చాలు. దర్శకుడు సుజిత్ తన మీద ఉంచిన అతి బరువైన బాధ్యతను అనుకున్న దాని కన్నా అద్భుతంగా నిర్వర్తించాడని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఇంకో ఇరవై రోజుల్లో రానున్న సాహోకు ఈ ట్రైలర్ రెడ్ కార్పెట్ పరిచిందనే చెప్పాలి.