Begin typing your search above and press return to search.

సాహో సైలెన్స్ ని బ్రేక్ చేయాలి

By:  Tupaki Desk   |   26 Jun 2019 5:19 AM GMT
సాహో సైలెన్స్ ని బ్రేక్ చేయాలి
X
టాలీవుడ్ మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన సాహో విడుదలకు ఎక్కువ టైం లేదు. కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉంది. టీజర్ వచ్చి రెండు వారాలు అవుతోంది. దాని తాలూకు వేడి కూడా చల్లారిపోయింది. ఇన్నేసి మిలియన్ వ్యూస్ అని చెప్పుకోవడం కూడా పూర్తయ్యింది. ఇక నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ మీద సాహో టీమ్ సీరియస్ గా దృష్టి పెట్టాలి.

అసలే పాన్ ఇండియా రిలీజ్. అన్ని భాషల్లోనూ కలిపి సుమారు రెండు వందల యాభై కోట్ల పెట్టుబడిని బయ్యర్లు పెడుతున్నారు. తెలుగు వరకు హైప్ వద్దన్నా వస్తుంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో అందులోనూ నార్త్ లో దీని గురించి భారీ హైప్ వచ్చేలా పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి. ఎంతసేపు బాహుబలి క్రేజ్ ఉంది కదా అని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. ఇది కమర్షియల్ మూవీ కాబట్టి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరగాలంటే ఆసక్తి పెంచేదాని మీద దృష్టి పెట్టాలి

అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలి. మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. బాలీవుడ్ లో చాలా కీలకంగా భావించే ఆడియోని బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చాలా బాధ్యతలు నెత్తి మీదున్నాయి. ఆస్ట్రియాలో చివరి పాట చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లిన యూనిట్ రాగానే ఊపిరి ఆడనంత పనులు ఉన్నాయి. ప్రభాస్ సైతం ఓ రెండు నెలలలు రాధాకృష్ణ సినిమా పక్కనపెట్టి మరీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా హిందీ సినిమాల ఆడియోలు మూడు నాలుగు నెలల ముందే ఆన్ లైన్ లో పెట్టేస్తారు. ఓ రెండు వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారు. కానీ సాహో విషయంలో ఇంకా అలాంటి కదలికలు కనిపించడం లేదు. ఇప్పటికైనా కాస్త త్వరపడి స్పీడ్ పెంచితే బెటర్