Begin typing your search above and press return to search.
సాహో మాటని నమ్మొచ్చు కదా ?
By: Tupaki Desk | 31 July 2019 5:44 AM GMTమొన్నటిదాకా సాహో రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 అని మెంటల్ గా ఫిక్స్ అయిన అభిమానులకు షాక్ ఇస్తూ రెండు వారాలు వాయిదా పడటం మరీ తీవ్రంగా ఎఫెక్ట్ ఇవ్వలేదు కానీ పోనీ ఇప్పుడు కొత్తగా చెప్పిన ఆగస్ట్ 30 అయినా ఖచ్చితంగా మాట మీద ఉంటారా అనే అనుమానం కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతూనే ఉంది. గతంలో ఇంత భారీ కాన్వాస్ తో రూపొందిన చిత్రాలు పదే పదే డేట్లు మార్చుకోవడం చాలా సార్లు జరిగింది. అమ్మోరు-అంజి-అరుంధతి-ఢమరుకం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది.
సాహో కూడా వీటికి భిన్నంగా ఏమి వెళ్లడం లేదు. కాకపోతే ఇది ఇప్పటిదాకా తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కమర్షియల్ యాక్షన్ ఫిలిం. అందుకే బయ్యర్లు సైతం దీని మీద కనివిని ఎరుగని రీతిలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డీల్స్ మొదలయ్యాయి. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కాబట్టి చాలా వ్యవహారాలు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30 డేట్ అందుకునేందుకు యువి సంస్థ డే అండ్ నైట్ కష్టపడాలి. ఒకపక్క ప్రమోషన్ మరోపక్క బిజినెస్ డీల్స్ ఇంకోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు అటుపక్క విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ఇంకోచోట సెన్సార్ వ్యవహారాలు వెరసి సాహోకు ముందున్నది ఛాలెంజ్ పీరియడ్.
ఇప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ మాత్రం అశ్రద్ధ వహించినా టార్గెట్ రీచ్ కాలేరు. అదే జరిగి మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి వస్తే ఇతర నిర్మాతల సినిమాలు చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అవుతాయి. నాని గ్యాంగ్ లీడర్ సూర్య బందోబస్త్ ఈ కారణం వల్లే ముందు ప్రకటించిన ఆగస్ట్ 30కి కట్టుబడాలా వద్దా అనే అయోమయంలో ఉన్నాయి. కాబట్టి సాహో ఖచ్చితంగా వస్తేనే ఎలాంటి నెగటివ్ రిమార్క్ లేకుండా ప్రేక్షకుల నుంచి మంచి వెల్కం దక్కించుకుంటుంది. ఏ మాత్రం మార్పు జరిగినా జరిగేది ఊహించుకోవడం కూడా కష్టమే