Begin typing your search above and press return to search.
సాకిని-డాకిని టీజర్ : పోలీస్ అకాడమీలో దామిని - షాలిని అల్లరి!
By: Tupaki Desk | 23 Aug 2022 6:11 AM GMTరెజీనా కసాండ్రా, నివేదా థాయస్ ప్రధాన పాత్రల్లో నటిచిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ 'సాకిని - డాకిని'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. పోలీస్ అకాడమీలోకి శిక్షణ కోసం ప్రవేశించిన ఇద్దరు యువకులు తమ చిల్లర చేష్టలు.. చిలిపి అల్లరితో ఎలాంటి హంగామా చేశారు? .. ఫైనల్ గా అకాడమీ నుంచి ఎలా బయటికి వెళ్లారనే రోమ్ కోమ్ యాక్షన్ కామెడీ గా కొరియన్ మూవీని తెరకెక్కించారు.
అయితే తెలుగుకు వచ్చే సరికి ఇదకదు యువకుల పాత్రలని కాస్తా యువతులుగా మార్చి తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ సంముక్తంగా ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 16న విడుదల కానున్న ఈ మూవీ టీజర్ ని మంగళవారం విడుదల చేశారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ పోలీస్ అకాడమీలో ట్రైనర్స్ గా కనిపిస్తున్నారు.
నివేదా ఫుడీ.. ఆకలికి తట్టుకోలేదు. క్యాంటీలో వున్న వాటిని రహస్యంగా కొట్టేసి తన కబ్బోర్డ్ లో స్టోర్ చేస్తూ వుంటుంది. కానీ రెజీనా అలా కాదు. తనకు ఓసీడీ సమస్య.. తన చుట్టూ నీట్ గా లేకపోతే అస్సలు సహించదు.
పోలీస్ ట్రైనింగ్ లో ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు ఫెయిల్ అవుతూ చీవాట్లు తింగుంటారు. అంతే కాకుండా అనవసరమైన తగాదాల్లో తలదూరుస్తూ వుంటుంటారు. ఒకానొక దశలో పోలీస్ అకాడమీ నుంచి తప్పించుకున్న వీళ్లకు అనుకోని సంఘటనలు ఎదురవుతున్నట్టుగా టీజర్ లో చూపించారు.
అంతే కాకుండా ఒక సైకో వీరిని వెంబడించడం.. ఓ యువతిని అత్యంత దారుణంగా హింసిస్తున్న దృశ్యాలని చూపించారు. ఆ సైకో కిల్లర్ నుంచి దామిని, షాలిని ఎలా తప్పించుకున్నారు?..ఎలా మళ్లి అకాడమీలో చేరారు అన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. టీజర్ ని బట్టి చూస్తుంటే సినిమాలో వినోదం, యాక్షన్ తో పాటు బలమైన కథ, డ్రామా వున్నట్టుగా తెలుస్తోంది. నివేదా, రెజీనా తమదైన స్టైల్లో ఈ పాత్రలని రక్తి కట్టించారు.
కొన్ని సన్ని వేశాల్లో డేర్ డెవిల్స్ గా నటించి అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. సుధీర్ వర్మ ఈ థ్రిల్లర్ ని తనదైన పంథాలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. కొరియన్ మూవీకి భిన్నంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని స్పష్టమవుతోంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా, మైకీ మెక్ క్లియరీ, నరేష్ కుమార్ ల నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం వుంది.