Begin typing your search above and press return to search.
కొత్త ట్రైలర్: మ్యాడీ... చంపేశాడంతే
By: Tupaki Desk | 16 Dec 2015 5:56 AM GMTఓ సినిమా కమిటయ్యాం.. సరదాగా షూటింగులో పాల్గొన్నామా.. అవగొట్టామా అన్నట్లుంటారు కొందరు హీరోలు. కానీ ఇంకొందరు సినిమా అంటే ప్రాణం పెడతారు. పాత్ర కోసం ఏమైనా చేస్తారు. చేస్తున్న పాత్రలోనే జీవిస్తారు. ఇలాంటి నటులు అరుదుగా కనిపిస్తారు. మాధవన్ ఆ టైపు వాడే. సరైన క్యారెక్టర్ పడాలే కానీ.. మాధవన్ కెమెరా ముందు చెలరేగిపోతాడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఈ మధ్య కాలంలో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ మినహా మాధవన్ సినిమా ఏదీ రాలేదు. ఐతే మ్యాడీ ఎక్కువ సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం అవకాశాలు లేకపోవడం కాదు.. ‘సాలా ఖాడూస్’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో అతను మునిగిపోవడమే.
ఒక బాక్సింగ్ కోచ్ జీవిత గాథతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం రెండేళ్ల కిందట్నుంచి కష్టపడుతున్నాడు మ్యాడీ. ఆ కష్టం వృథా పోలేదు. కొన్ని నెలల కిందట వచ్చిన టీజర్ ఔరా అనిపిస్తే.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అబ్బుర పరుస్తోంది. యారొగెంట్ అయినప్పటికీ కమిట్ మెంట్ ఉన్న బాక్సింగ్ కోచ్.. కానీ స్పోర్ట్స్ పాలిటిక్స్ కారణంగా ఢిల్లీ నుంచి చెన్నికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అక్కడ తాను సానబెట్టాల్సిన వజ్రం కోసం చూస్తుంటాడు మాడీ. పోటీల్లో పాల్గొనే బాక్సర్లెవరిలోనూ అతడికి స్పార్క్ కనిపించదు. కానీ టోర్నీ ఆర్గనైజర్స్ తో గొడవ పడుతున్న బస్తీ అమ్మాయిలో పంచ్ పవర్ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని బాక్సర్ గా మార్చే పనిలో పడతాడు. కానీ శత్రువులు అడ్డుపడతారు. ఆ అడ్డంకుల్ని దాటుకుని ఆ అమ్మాయిని ఈ కోచ్ ఎలా ఛాంపియన్ ను చేశాడన్నది ‘సాలా ఖాడూస్’ కథ. ట్రైలర్ కథపై ఐడియా ఇవ్వడంతో పాటు సినిమా మీద బాగానే ఆసక్తి రేపింది. మాధవన్ తో పాటు బాక్సర్ గా చేసిన అమ్మాయి కూడా చితక్కొట్టేసినట్లే ఉంది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.