Begin typing your search above and press return to search.

పాక్ పాప మాట మార్చింది

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:46 AM GMT
పాక్ పాప మాట మార్చింది
X
పాకిస్తానీ నటులపై అసలే ఇండియాలో పరిస్థితులు సరిగ్గా లేవు. వాళ్లను తీసుకుంటే సినిమాల రిలీజ్ కి నానా కష్టాల పడాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో సాబా ఖమర్ ఓ బాంబ్ పేల్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు మరికొందరు హీరోలపై దారుణమైన కామెంట్స్ చేసింది.

సల్మాన్ ఖాన్ ను చీప్ పర్సన్ అంటూ పెట్టిన వీడియోపై.. ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది సాబా. సింపుల్ గా అదంతా కామెడీ చేశా అనేస్తోంది. ' గుడ్ మాణింగ్ జిందగీ అనేది ఓ ఫన్నీ ప్రోగ్రామ్. బాలీవుడ్ స్టార్స్ గురించి అడిగితే.. ఫన్నీగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అందుకే అలా చెప్పాను. నేను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని.. ముఖ్యంగా సల్మాన్ ను చాలా ఇష్టపడతాను. తను ఓ పెద్ద స్టార్ అంతే కాదు.. చాలా మంచి వ్యక్తి కూడా. అతని వ్యక్తిత్వం చాలా మంచిది' అని చెప్పింది సాబా.

కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ని చిచ్చోరా(చీప్ పర్సన్) అంటూ కామెంట్ చేసిన సాబా ఖమర్.. ఇమ్రాన్ హష్మీతో ఎట్టి పరిస్థితుల్లోను నటించనని.. అతనికి లిప్ కిస్ ఇస్తే నోటి క్యాన్సర్ వస్తుందని ఆరోపించింది. పాకిస్తాన్ లో తను పెద్ద నటిని కావడంతో.. బాలీవుడ్ లో రితేష్ దేశ్ ముఖ్ లాంటి చిన్న హీరోతో నటించబోనని అనింది. అలాగే హృతిక్ రోషన్ ను ఇద్దరు బిడ్డల తండ్రి అని.. తన టైప్ కాదని అనింది సాబా. ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నీ కామెడీకే చేశానని చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/