Begin typing your search above and press return to search.
సచిన్-లతా వీడియో పెద్ద దుమారమే
By: Tupaki Desk | 31 May 2016 4:37 AM GMTఇప్పుడు బాలీవుడ్ లో తన్మయ్ భట్ అనే ఓ కమెడియన్ పోస్టు చేసిన వీడియో మామూలు రచ్చ చేయట్లేదు. ఏ.ఐ.బి అనే యుట్యూబ్ గ్రూపును మొదలెట్టిన ఇతగాడు.. అప్పట్లో రోస్ట్ అంటూ ఒక కార్యక్రమం చేసి విమర్శలకు గురయ్యాడు. ఇప్పుడు ఏకంగా సచిన్ టెండుల్కర్ అండ్ లతా మంగేష్కర్ పైన ఊర కామెడీ ఒకటి చేశాడు. ఇది ఇప్పుడు పెద్ద దుమారానికే దారి తీస్తోంది.
''సచిన్ వర్సెస్ లతా సివిల్ వార్'' మనోడు స్నాప్ చాట్ అనే యాప్ లో ఒక వీడియో తయారు చేసి.. దానిని అక్కడే కాకుండా ఫేస్ బుక్ లో కూడా పోస్టు చేశాడు. ఆ వీడియోలో 'విరాట్ నాకన్నా గ్రేట్ అంటారా?' అంటూ సచిన్ బూతులు తిడుతుంటే.. ఇంతలో మనోడికి సపోర్టు చేయడానికి లతా మంగేశ్కర్ వస్తుంది. వెంటనే స్పందించిన సచిన్.. ''హాయ్ లతా తాయి.. నీ వయస్సు ఒక 5000 సంవత్సరాలు ఉంటుందా?' అంటూ కామెడీ చేస్తాడు. యాప్ సహాయంతో.. తన్మయ్ బట్ రెండు పాత్రలనూ తనే నటించి.. ఫేస్ మాత్రం సచిన్ అండ్ లతా టైపులో మార్ఫింగ్ చేశాడు.
ఇది చూసిన బాలీవుడ్ షాకైంది. మిగతా ఆడియన్స్ కూడా ఖంగుతిన్నారు. అందరూ తన్మయ్ ను బూతులు తిడుతున్నారు. అనుపమ్ ఖేర్ - రితేష్ దేశ్ముక్ - రామ్ గోపాల్ వర్మ వంటి వారు.. ఇది ఫ్రీ స్పీచ్ కాదు.. ఫ్రీ ఇన్సల్ట్ అంటూ తన్మయ్ పై సెటైరేశారు. ఇక కొన్ని మహారాష్ట్ర పొలిటికల్ పార్టీలైతే ఏకంగా తన్మయ్ పై కేసులు పెట్టేశారు. ముంబయ్ పోలీసులు ఇంకో అడుగు ముందకేసి.. ఏకంగా ఈ వీడియోను బ్లాక్ చేయాలని గూగుల్ అండ్ యుట్యూబ్ వారిని సంప్రదిస్తున్నారు. అయితే తాను చేసింది ఒక హ్యూమర్ మాత్రమేనని చెబుతూ.. ఎక్కడా కూడా తగ్గట్లేదు తన్మయ్. ''మనిషి చావకుండానే డెత్ అంటూ ట్రెండ్ చేసే ట్విట్టర్ అండ్ బాలీవుడ్ జనాలు నేను చేసింది క్రాప్ అంటున్నారు.. హా హా హా'' అంటూ ఇంకా వెక్కిరించాడు. అంతేకాదు.. నా గురించి పేపర్లలో ఏం రాసినా కూడా.. నా స్నాప్ చాట్ ఐడి పేరు.. నా ఫేస్ బుక్ ఎకౌండ్ అడ్రస్ కరక్టుగా ప్రచురించండే అంటూ మరో పంచ్ వేశాడు. విషయం ఎక్కడివరకు వెళుతుందో తెలియదు కాని.. ఇలాంటి డార్క్ సెటైరికల్ కామెడీ ఇండియన్ సొసైటీ తట్టుకోలేదు అనడానికి ఇదే నిర్వచనం. ఎంత చెప్పినా కూడా.. తన్మయ్ కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే అనిపిస్తోంది.
ఇకపోతే ముంబయ్ పోలీస్ వారి అత్యుత్సాహం చూస్తే.. మనలో మనం ఒక మాట చెప్పుకోవాలి.. దేశి స్కాండల్ అని ఏదైనా పోర్న్ వెబ్ సైట్లో టైప్ చేస్తే.. దాదాపు 1 కోటి వీడియోలు వస్తున్నాయి. వాటన్నింటినీ బ్యాన్ చేయమని వీళ్ళెప్పుడూ ఎటువంటి యాక్షన్ తీసుకోరు ఏంటో? సచిన్ అండ్ లతా మంగేష్కర్ ది అయితే పరువు.. ఆ వీడియోల్లో అన్యాయంగా ఎక్సపోజ్ చేయబడిన వారిది.. అబ్బే.. ఏమీ కాదా??