Begin typing your search above and press return to search.

సచిన్ టెంపర్ చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   19 March 2016 4:00 AM IST
సచిన్ టెంపర్ చూపిస్తాడా?
X
జూనియర్ ఎన్టీఆర్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ మూవీ ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాని తమిళ్ లో విశాల్ హీరోగా రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలుగు టెంపర్ లో నటించిన కాజల్ అగర్వాల్.. తమిళ్ లో కూడా హీరోయిన్ గా నటించనుంది. అయితే.. ఈ కోలీవుడ్ టెంపర్ నిర్మాతల లిస్టే వెరైటీగా ఉంది.

టాగూర్ మధు - నల్లమలుపు బుజ్జి - బండ్ల గణేష్ కలిసి.. తమిళ్ టెంపర్ నిర్మించనున్నారనే వార్తలొస్తున్నాయి. నిజానికి టెంపర్ తమిళ్ - హిందీ రైట్స్ ను సచిన్ జోషి గతంలోనే కొనేశాడు. పైగా బండ్లకి - సచిన్ కి అసలు పడడం లేదు కూడా. ఎవరైనా బండ్లతో సినిమా తీస్తే.. అది రిలీజ్ కానివ్వబోనని ట్విట్టర్ సాక్షిగా ఈ మధ్యే బెదిరించాడు. పైగా బండ్లను జైల్లో పెట్టిస్తానని శపథం కూడా చేశాడు.

మరిప్పుడు తమిళ్ టెంపర్ రీమేక్ నిర్మాతగా బండ్ల గణేష్ ఎలా వచ్చాడనేది ఆశ్చర్యకరమైన విషయం. గతంలో సచిన్ - బండ్లకు డీలింగ్స్ బాగానే ఉండేవి, ఇప్పుడు చెడిపోయాయి. మళ్లీ పాత బంధం వికసిస్తోందా.. కొత్త గొడవ సెటిల్ అయిపోయిందా అనుకుంటున్నారు జనాలు. ఈ సెటిల్ మెంట్ జరక్కపోతే మాత్రం.. టెంపర్ రీమేక్ సంగతేమో కానీ.. సచిన్ టెంపర్ ఏంటో విశాల్ చూడాల్సి వస్తుందనే టాక్ వినిపిస్తోంది.