Begin typing your search above and press return to search.
ఆ హీరోకు అన్ని ఆస్తులా? తాజాగా జఫ్తు చేసిన ఈడీ
By: Tupaki Desk | 16 Jan 2022 4:37 AM GMTఆ హీరో మామూలోడు కాదు. తెలుగులోనే కాదు.. హిందీలోనూ యాక్ట్ చేస్తుంటాడు. వరుస పెట్టి సినిమాలు తీసే అతడు.. తరచూ సినిమాలకు ఏ మాత్రం సంబంధంలేని క్రైం న్యూస్ లో దర్శనమిస్తుంటారు. పలు కేసులకు సంబంధించిన ఉదంతాల్లో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. వరుస పెట్టి హీరోగా సినిమాలు తీసినా హిట్టు కొట్టని ఆయన.. నిర్మాతగా కూడా సినిమాలు తీశాడు. అయినా.. విజయం మాత్రం వరించలేదు. అలాంటి హీరో కమ్ నిర్మాత తాజాగా మరోసారి క్రైం న్యూస్ లో భాగమయ్యాడు. ఇంతకీ ఆ ప్లాప్ హీరో ఎవరంటే.. సచిన్ జోషి.
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ‘‘మౌనమేలనోయి’తో టాలీవుడ్ కు పరిచయమైన ఇతడు.. తర్వాతి కాలంలో ‘నిను చూడక నేనుండలేను’.. ‘ఒరేయ్ పండు’.. ‘నీ జతగా నేనుండాలి’.. ‘వీడెవడు’ సినిమాల్లో నటించిన సచిన్ జోషి.. హిందీ సినిమాల్లోనూ నటించాడు. తాజాగా అతడికి చెందినవిగా చెబుతున్న రూ.410 కోట్ల ఆస్తుల్ని ఈడీ అధికారులు జప్తు చేసినట్లుగా చెబుతున్నారు.
ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూపునకు చెందిన ఆస్తులుకాగా.. మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి సంబంధించినవిగా చెబుతున్నారు. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికిచెందిన ఓంకార్ గ్రూపు తప్పులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఈ ఫిర్యాదుల మీద విచారణ జరిపిన ఈడీ.. చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా రూ.410కోట్లఆస్తుల్ని జప్తు చేసినట్లు చెబుతున్నారు. ఈ మోసానికి సంబంధించిన వివరాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంది. ఒక ప్లాప్ హీరోకు చెందిన ఆస్తులు ఇంత భారీగా ఉండటం అవాక్కు అయ్యేలా చేస్తోంది.