Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ తో పండు ట్వీట్ వార్
By: Tupaki Desk | 14 Aug 2015 12:26 PM GMTబండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పాపులర్. గబ్బర్ సింగ్, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు తీసి అగ్ర నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఏం లాభం? ఆ పేరుకి మచ్చ వచ్చింది. బ్లాక్ బస్టర్ గణేష్ ని కాస్తా ఓ కుర్రహీరో 'ఫ్రాడ్ గణేష్' అంటూ చీవాట్లు పెట్టేశాడు. ఇది నిజ్జంగా నిజం. ఆన్ లైన్ లో ట్వీట్ వార్ లో దొరికిన ఇంట్రెస్టింగ్ క్లూ ఇది.
అప్పట్లో బండ్లగణేష్ 'నీ జతగా నేనుండాలి' చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాతోనే ఒరేయ్ పండు ఫేం, ముంబై పాన్ మసాలా హీరో సచిన్ జోషితో చెలిమి కుదిరింది. సినిమా స్నేహం కలకాలం కుదరదనే అంటారు. అదే జరిగింది ఈ ఇద్దరి మధ్యలో. సచిన్ తో గణేష్ కి గొడవలొచ్చాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా చెడింది. గణేష్ ఇచ్చిన ఓ చెక్కు చెల్లకపోవడంతో సచిన్ జోషికి చెందిన 'వైకింగ్ మీడియా' నుంచి 'పరమేశ్వర ఆర్ట్స్ కి' కోర్ట్ నోటీసులు అందాయి. అప్పట్నుంచి ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది.
ప్రస్తుతం కేసు పరిశోధనలో ఉంది. ఈలోగానే గణేష్ ఇచ్చిన ఓ ట్వీట్ అలజడి రేపింది. 'నమ్మకం ఉన్నప్పుడు ప్రతి కథా నిజంలానే ఉంటుంది. అది పోయినప్పుడు కట్టుకథ అయిపోతుంది' అంటూ ట్వీటాడు గణేష్. దీనికి రిప్లయ్ గా 'నువ్వు చేసిన ఫ్రాడ్ నమ్మించేలా లేదు. ఎవరూ ఎప్పటికీ నమ్మలేని ఫ్రాడ్ ఇది. ఫ్రాడ్ కంటే కూడా ఇది షేమ్ లెస్. ఏ ప్లేటుతో భోజనం పెట్టావో అందులోనే కక్కావు' అంటూ కఠోరంగా చీవాట్లు వేశాడు సచిన్ జోషి. ఈ ఇద్దరిమధ్యా వార్ ఇప్పటిలో చల్లారేది కాదు అని అర్థమయ్యింది దీంతో.