Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్.. ఓ పిల్లి..
By: Tupaki Desk | 8 March 2018 4:29 AM GMTసినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన బండ్ల గణేష్ తరవాత కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజికి పెరిగాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీశాడు. కానీ బండ్ల గణేష్ ఓ పచ్చి మోసగాడంటూ అతడి బ్యాక్ బోన్ గా నిలిచిన హీరో.. బిజినెస్ మేన్ సచిన్ జోషి అప్పట్లో చెప్పిన మాటలు సంచలనమయ్యాయి.
అసలు బండ్ల గణేష్ తో తనకు పరిచయడం ఎలా ఏర్పడింది.. అతడితో సినిమాలు ఎందుకు తీసిందీ సచిన్ రీసెంట్ గా బయటపెట్టాడు. ‘‘ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన తాను హీరోగా నటించిన ఒరేయ్ పండు సినిమాలో బండ్ల గణేష్ తనకు పరిచయం అయ్యాడు. అప్పటికే నేను చాలా రిచ్ బిజినెస్ మేన్ అని తెలుసుకుని తాను చాలా కష్టాల్లో ఉన్నానని.. పైకెదగడానికి సాయం కావాలని కోరాడు. దాంతో సినిమా ప్రొడ్యూసింగ్ లో అతడిని చేర్చుకున్నాం. అతడు తీసిన సినిమాలకు ఫైనాన్స్ చేశాం. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు. అతడికి మనుషులను మోసం చేయడమనే వ్యాధి ఉంది. నావరకు అతడో పిల్లి. కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకునే టైపు.’’ అంటూ బండ్ల తీరుపై ఫైరయ్యాడు సచిన్ జోషి.
తాను సినిమాలు మానేసి ప్రొడ్యూసర్ గా ఉన్న టైంలో తిరిగి నటించమంటూ ఒత్తిడి చేసింది బండ్ల గణేషేనని సచిన్ చెప్పుకొచ్చాడు. సచిన్ హీరోగా ఆషికి-2 ను తెలుగులో రీమేక్ చేసి ‘నీజతగా నేనుండాలి’ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు తనను చూడాలని తెగ కోరుకుంటున్నారని ఒకటికి పదిసార్లు చెప్పడంతోనే ఆ సినిమా చేశానని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ బండ్ల తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు ఈ బిజినెస్ మాన్.