Begin typing your search above and press return to search.
సచిన్ సపోర్ట్.. ఎందుకంటారూ?!
By: Tupaki Desk | 23 Jun 2016 8:22 AM GMTరామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో పెద్ద డైరెక్టరే కాదు.. నిర్మాత కూడా. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే. ఇప్పుడు పెద్దగా డిమాండ్ అయితే ఏం లేదు కానీ.. వర్మ మాత్రం వెలిగిపోతున్నాడు. కొన్నేళ్ల క్రితం దివాలా తీసేస్తాడేమో అనిపించుకుని.. ఇప్పుడు లగ్జరీ లైఫ్ కి మళ్లీ కేరాఫ్ అడ్రస్ గా నిలవడం వెనక.. సచిన్ ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక్కడ సచిన్ అంటే సచిన్ జోషి అనే విషయం గుర్తుంచుకోండే. రీసెంట్ గా ఇతడిని హీరోగా పెట్టి వీరప్పన్ మూవీ తీశాడు వర్మ. అది ఫ్లాప్ అయినా.. ఇద్దరి మధ్య బంధం బాగానే బలపడిందని టాక్. సచిన్ తో బంధం గట్టిబడ్డాకే.. వర్మ కొత్త ఆఫీసును కూడా మొదలుపెట్టాడు. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో.. విలాసవంతమైన ఆఫీస్ ని ప్రారంభించిన వర్మ.. దాని ఓపెనింగ్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఆహ్వానించి.. ఆ వీడియోను నెట్ లో పోస్ట్ చేశాడు.
అంతే కాదు అమితాబ్ తో సర్కార్ రాజ్ కు సీక్వెల్ తీయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. ఇదంతా చేసేందుకు మరి ఫండింగ్ ఎక్కడి నుంచి అనే డౌట్ సహజం. అక్కడే ఇండస్ట్రియలిస్ట్ సచిన్ జోషి పేరు చెబుతున్నారు బాలీవుడ్ జనాలు. సచిన్ తోడుండగా వర్మకి ఏంటి చింత అనే డైలాగ్ కూడా వినిపిస్తోందండోయ్. ఇంతకీ వర్మకి సచిన్ సపోర్ట్ వెనక కారణం ఏంటో.. వరుసగా చకచకా సినిమాలు తీసేందుకు తనకో డైరెక్టర్ దొరికాడనే ఉద్దేశ్యం కావచ్చు.