Begin typing your search above and press return to search.
రియల్టర్ చేతిలో కోట్లల్లో మోసపోయిన సచిన్ నయన్ రమ్యకృష్ణ!!
By: Tupaki Desk | 26 July 2020 11:30 PM GMTరియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అత్యధిక మోసాలు జరుగుతూ ఉంటాయి. ఒకరి భూమిని మరొకరు అమ్మడం.. ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాలు తెలిసి కూడా కొందరు రియల్టర్స్ ను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు గతంలో పలు సార్లు రియల్టర్స్ వలలో పడి మోసపోయారు అంటూ మనం వార్తల్లో విన్నాం. తాజాగా మరో అతి పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఈసారి భారతరత్న సచిన్ టెండూల్కర్‌తో పాటు హీరోయిన్ నయనతార సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా మోసపోయారు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రావిర్యాలలోని భూములను ఆధిత్య హోమ్స్ పేరుతో కోటా రెడ్డి వెంచర్ మాదిరిగా చేసి సచిన్ కు ఆరు ఎకరాల భూమిని నయన్ మరియు రమ్యకృష్ణలకు ఒక్కో ఎకరం ఇంకా కొంత మందికి కొంత మొత్తంలో భూమిని అమ్మడం జరిగింది. కోట్లల్లో ఈ డీల్స్ జరిగాయి. అయితే ఒక భూమి విషయంలో కోటారెడ్డి మరియు సుధీర్ రెడ్డికి వివాదం తలెత్తింది. దాంతో సుధీర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కోటా రెడ్డి మోసాలను బట్టబయలు చేశాడు. అవి చెరువు భూమి అయినా కూడా తెలియని వారికి కోటా రెడ్డి అమ్మాడు.
ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సచిన్ తో ప్రారంభోత్సవం చేయించారు. ప్రభుత్వం ఆ భూమిలో ఎలాంటి డెవలపింగ్ పనులు చేపట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై ప్రధానికి మరియు రాష్ట్రపతికి సుధీర్ లేఖ రాశారట. భారత రత్న అయిన సచిన్ ను కోటా రెడ్డి మోసం చేశాడు అంటూ ఆ లేఖల్లో పేర్కొన్నాడు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.