Begin typing your search above and press return to search.

వర్మ సినిమాలో అతను కామెడీ అయిపోయాడు

By:  Tupaki Desk   |   28 May 2016 11:00 PM IST
వర్మ సినిమాలో అతను కామెడీ అయిపోయాడు
X
మొన్న ముంబయిలో ప్రివ్యూ షో పడటం ఆలస్యం.. ‘వీరప్పన్’ గురించి సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్ ట్వీట్లు పడిపోయాయి. దీంతో వర్మ బాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చేస్తున్నాడంటూ అతడి మద్దతుదారులు సంబరాలు చేసేసుకున్నారు. కానీ నిన్న సినిమా రిలీజయ్యాక సామాన్య ప్రేక్షకులు.. క్రిటిక్స్ రెస్పాన్స్ మరోలా ఉంది. వర్మ చివరగా బాలీవుడ్లో తీసిన సినిమాలతో పోలిస్తే ‘వీరప్పన్’ బెటరే కానీ.. మామూలుగా చూస్తే మాత్రం ఇదేమంత గొప్ప సినిమా కాదని తేల్చేశారు జనాలు. సినిమాకు ఏవరేజ్ రేటింగులు వస్తున్నాయి. జనాల కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి.

సినిమాలో కెమెరా యాంగిల్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. వర్మ టేకింగ్.. వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్ పెర్ఫామెన్స్ గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమా అంత ఆసక్తికరంగా లేదని చెబుతున్నారు. సినిమాలో సీరియస్ నెస్ తగ్గిపోవడానికి వర్మ ఎంచుకున్న ఇద్దరు ఆర్టిస్టులు ప్రధాన కారణమని అంటున్నారు. అందులో ప్రధానంగా ప్రస్తావిస్తోంది సచిన్ జోషి గురించే. ‘కిల్లింగ్ వీరప్పన్’లో శివరాజ్ కుమార్ పోషించిన పాత్రను హిందీలో సచిన్ చేశాడు.

ఇక్కడ శివరాజ్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవగా.. హిందీలో సచిన్ క్యారెక్టరే పెద్ద మైనస్ అంటున్నారు. స్టేచర్ ఉన్న ఆర్టిస్టు చేయాల్సిన ఈ పాత్రను సచిన్ లాంటి యాక్టింగ్ తెలియని ఆర్టిస్టు చేయడంతో కామెడీ అయిపోయింది. అతడి నటనను క్రిటిక్స్ తూర్పారబడుతున్నారు. పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడని వర్మ అతడితో కీలకమైన పాత్ర చేయించి తప్పు చేశాడని అంటున్నారు. మరోవైపు లిసారే పాత్ర.. ఆమె నటనను కూడా తప్పుబడుతున్నారు. మామూలుగా ఆర్టిస్టుల విషయంలో పక్కాగా ఉండే వర్మ.. వీళ్లిద్దరి విషయంలో మొహమాటానికి పోయి దెబ్బ తిన్నట్లున్నాడు. ఐతే సినిమా గురించి పెదవి విరచడానికి వీళ్లిద్దరే కారణం కాదనుకోండి. ఎప్పుడైనా కంటెంటే కదా అన్నిటికంటే ముఖ్యం.