Begin typing your search above and press return to search.

సచిన్ కొడుకు సినీ అరంగేట్రం

By:  Tupaki Desk   |   17 April 2016 11:00 PM IST
సచిన్ కొడుకు సినీ అరంగేట్రం
X
ఇటీవల కాలంలో బాలీవుడ్ లో జీవిత చరిత్రల అధారంగా సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పైగా దాదాపుగా అలాంటి సినిమాలన్నీ విజయవంతమవుతున్నాయి. తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగానూ ‘సచిన్’ అనే సినిమా రెడీ అవుతోంది. సచిన్ పై సినిమా అనగానే కోట్లాది మంది అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఆ సినిమా సంగతులు తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆ సినిమాలో సచిన్ తనయుడు అర్జున్ నటిస్తున్నాడని తాజాగా తెలియడంతో అభిమానుల ఆనందానికి అడ్డేలేకుండా పోతోంది. అభిమానులే కాదు, సచిన్ కూడా ఈ విషయంలో తెగ సంతోషిస్తున్నారట. తన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో తనయుడ్ని నటింపజేయడం ఏ తండ్రికైనా అద్భుతమైన అనుభూతి. సచిన్ కూడా ఇప్పుడా మధురానుభూతికి లోనవుతూ తెగ సంతోషపడిపోతున్నాడు.

"సచిన్" సినిమాలో సచిన్ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు అర్జున్ టెండుల్కర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలతోపాటు ఆయన సన్నిహితులు కూడా ఒత్తిడి చేయడంతో అర్జున్ ను నటింపజేయడానికి సచిన్ సమ్మతించాడని సమాచారం. మరి అర్జున్ తండ్రిలా గొప్ప క్రికెటర్ అవుతాడో లేదంటే యాక్టింగ్ కెరీర్ కొనసాగించి వెండితెర లెజెండ్ అవుతాడో చూడాలి.