Begin typing your search above and press return to search.
సచిన్ స్వరం ఇబ్బంది పెట్టేస్తోందిట
By: Tupaki Desk | 27 April 2017 4:28 AM GMTప్రస్తుతం బయోపిక్ ల సీజన్ బాగానే నడుస్తోంది. ఇదే కోవలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ పై కూడా ఓ మూవీ సిద్ధమైపోయింది. కాకపోతే ఇది ఫీచర్ ఫిలిం మాదిరిగా కాకుండా.. డాక్యుమెంటరీ టైపులో ఉంటుంది. సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీ మే 26న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు.
అయితే.. ఈ చిత్రాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ చేరువ చేయాలని చూస్తున్నారు. ఇక్కడే దర్శకుడికి పెద్ద తలనొప్పి ఎదురవుతుంది. ఎందుకంటే.. ఇది డాక్యుమెంటరీ కావడంతో సచిన్ నేరేషన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగని ఏదో ఒక వాయిస్ పెట్టేస్తే సరిపోదు. సచిన్ ఎలా మాట్లాడతాడు.. తన వాయిస్ ఎలా ఉంటుందనే విషయం.. దేశంలో అందరికీ తెలుసు. అందుకే ఎవరో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించడం సాధ్యం కాదు.
సచిన్ కోసం ఏ స్టార్ హీరోను డబ్బింగ్ చెప్పమన్నా చెబుతారు కానీ.. అది కూడా డాక్యుమెంటరీకి కుదరదు. అందుకే సచిన్ వాయిస్ సరిపడేలా అనేక మందిని వాయిస్ లను టెస్ట్ చేస్తున్నారట. ఇప్పటికి 30మందికి వాయిస్ టెస్ట్ చేసినా.. ఒక్కరిదీ సరిపోకపోవడం దర్శకుడిని ఇబ్బంది పెట్టేస్తోందిట. మరి సచిన్ స్వరానికి దగ్గరగా ఉండే వాయిస్ ఎవరితో సెట్ అవుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/