Begin typing your search above and press return to search.

ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడేందుకు త్యాగాలు

By:  Tupaki Desk   |   9 July 2021 8:31 AM GMT
ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడేందుకు త్యాగాలు
X
క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. వ్య‌వ‌స్థ‌ల్ని వైర‌స్ కుప్ప‌కూల్చింది. తిరిగి వాటిని నిర్మించాలంటే వైర‌స్ ను పూర్తిగా త‌రిమేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికి రెండు సార్లు వైర‌స్ విజృంభించి అత‌లాకుత‌లం చేసింది. మూడో వేవ్ వ‌స్తుంద‌ని భ‌య‌పెట్టేస్తున్నారు.

ఇటీవ‌ల కరోనా వైరస్ సెకండ్ వేవ్ శాంతించింది.. ఆంక్షలు ఎత్తివేయ‌డంతో తిరిగి య‌థారాజా త‌థా ప్ర‌జా అన్న చందంగా ఎవ‌రి ప‌నిలో వారు నిమ‌గ్నం అవుతున్నారు. సినీరంగంలోనూ ఇటీవ‌ల స్పీడ్ పెరిగింది. టాలీవుడ్ లో వ‌రుస‌గా షూటింగులు తిరిగి ప్రారంభించారు. థియేట‌ర్ల‌ను తిరిగి తెర‌వ‌డానికి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. కానీ ఇంత‌లోనే థ‌ర్డ్ వేవ్ అంటూ సందేహాలు.. ఇలాంటి స‌మ‌యంలో సినిమాల్ని రిలీజ్ చేస్తే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న‌ది సందిగ్ధంగా మారింది.

ఆ క్ర‌మంలోనే ప‌లువురు నిర్మాత‌లు త‌మ సినిమాల్ని ఓటీటీల‌కు అమ్ముకునేందుకు రెడీ అవ్వ‌డంతో స‌ర్వత్రా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. థియేట‌ర్ల రంగాన్ని కాపాడాలంటే నిర్మాత‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే త‌మ సినిమాల్ని రిలీజ్ చేయాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ స‌హా ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

ద‌గ్గుబాటి సురేష్ బాబు నారప్ప- దృశ్యం 2 చిత్రాల‌ను ఓటీటీల‌కు విక్ర‌యించార‌న్న ప్ర‌చారం సాగింది. అంత‌లోనే తెలంగాణ ఛాంబ‌ర్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఆయ‌న నార‌ప్ప చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇత‌ర సినిమాల‌ను ఓటీటీల్లో డైరెక్ట్ రిలీజ్ చేయ‌రు. విక్ట‌రీ వెంక‌టేష్ సైతం ఈ విష‌యంలో ఎంతో స‌హ‌క‌రిస్తున్నారు. పాగల్- 18 పేజీస్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్- గల్లీ రౌడీ- తిమ్మరుసు ఇవేగా క చాలా సినిమాలు ప్రత్యక్ష డిజిటల్ విడుదలకు ప్లాన్ చేయ‌గా వారంతా ఇప్పుడు తిరిగి మ‌న‌సు మార్చుకుని థియేట్రిక‌ల్ రిలీజ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఎగ్జిబిష‌న్ రంగం కుప్ప‌కూల‌కూడ‌దంటే డిజిట‌ల్ కి సినిమాల‌ను అమ్మ కూడ‌దు అని వీరంతా నిర్ణ‌యానికి వ‌చ్చారు. నారప్ప విష‌యంలో అగ్ర నిర్మాత నిర్ణయం మార్చుకున్న త‌ర్వాత‌ మరికొన్ని సినిమాలు తమ డైరెక్ట్ డిజిటల్ ఒప్పందాలను రద్దు చేసి థియేట్రికల్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి.

స‌త్య‌దేవ్ న‌టించిన `తిమ్మరుసు` విడుదల తేదీని నిన్న సాయంత్రం ప్రకటించారు. సందీప్ కిష‌న్ న‌టించిన‌ `గల్లీ రౌడీ`ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. లవ్ స్టోరీ - టక్ జగదీష్ త్వరలో విడుదల తేదీలను ప్రకటించే వీలుంది. విశ్వ‌క్ సేన్ - పాగ‌ల్ థియేట్రిక‌ల్ రిలీజ్ సంగ‌తిని వెల్ల‌డించ‌నున్నారు. వీళ్ల‌తో పాటు చాలా మంది థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌నున్నారు.

కొరోనా వైరస్ థ‌ర్డ్ వేవ్ దేనినైనా డిసైడ్ చేస్తుంది. అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ తెలంగాణ ఛాంబ‌ర్ వేచి చూడాల్సిందిగా నిర్మాత‌ల‌ను కోరింది. అంటే ఈలోగానే థియేట్రికల్ రిలీజ్ చేసే వాళ్ల‌కు అడ్డు లేదు . అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకున్న వారికి థ‌ర్డ్ వేవ్ ఉందా లేదా? అన్న‌దానిపై క్లారిటీ వ‌స్తుంది అప్ప‌టికి. ప్ర‌స్తుతానికి ఎగ్జిబిష‌న్ రంగాన్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. దీనికి నిర్మాత‌లు స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రూవైంది.

హీరోలు ఓటీటీ రిలీజ్ ల‌కు ఈసారి ఓకే...!

కొంద‌రు నిర్మాత‌లు ఇంకా డిజిట‌ల్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న‌ప్పుడు.. థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆగాల‌నే హీరోల తో సింక్ కుద‌ర‌ని ప‌క్షంలో కొంత డైల‌మా నెల‌కొనేందుకు ఆస్కారం ఉంది. మొద‌టి వేవ్ స‌మ‌యంలో అలాంటి డైల‌మా ఉంది. కానీ ఈసారి నిర్మాత‌లకే హీరోలు ఆప్ష‌న్ ఇచ్చార‌ని అర్థ‌మ‌వుతోంది. ఏడాదిన్న‌ర కాలంగా క‌రోనా వ‌ద‌ల‌ని ప‌క్షంలో త‌మ నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌ద‌ని హీరోలు భావిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అటు కోలీవుడ్ లోనూ చాలా వ‌ర‌కూ థియేట‌ర్ల రంగాన్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నం సాగుతున్నా కొంద‌రు ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.