Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ చాప్టర్ - 2..సాడ్ ఎండింగ్..??
By: Tupaki Desk | 8 April 2020 2:30 AM GMTనేషనల్ వైడ్ గా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన మొదటి కన్నడ సినిమా 'కేజీఎఫ్'. ఆ సినిమాతో కథానాయకుడు యష్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగు తమిళ్ కన్నడ హిందీ అని తేడా లేకుండా ఈ యాక్షన్ మూవీ సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. కేజీఎఫ్-1 ఎండ్ కార్డు పడింది మొదలు.. కొనసాగింపు భాగం కాబట్టి ఆ తర్వాత పార్ట్ ని ఎలా మలుస్తున్నారు అనే ఉత్కంఠ అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ నెలకొనివుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన లికేజ్ న్యూస్ లు కొన్ని హాట్ టాపిక్ గా మారింది.
కేజీఎఫ్ మొదటి పార్ట్ లో ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరు ఊహించని విధంగా మనసుకు హద్దుకునేలా ప్రజెంట్ చేశాడు. ఇక అదే తరహాలో సెకండ్ పార్ట్ కూడా అంతకు మించిన ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఆడియెన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. కథలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అద్బుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించిన విలన్స్ ని చూపించి హీరో స్థాయిని తెలియకుండానే పెంచేశారు. ఇక కేజీఎఫ్ లాంటి పెద్ద కథలో మెయిన్ విలన్ ఎలా ఉండాలో మన ఊహలకు అందదు. అందుకే ప్రశాంత్ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ని అధీరా పాత్ర కోసం ఎంచుకున్నాడు. అతను మొదటి సీన్ తోనే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించేలా ఎంట్రీ వస్తాడని తెలుస్తోంది. ఇక ఎవరినైనా ఎదుర్కొనే రాకీ భాయ్ అతనితో ఎలా తలపడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఈ సినిమాలో గరుడ మరణాంతరం సామ్రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకునే రాకీ భాయ్ అప్పుడే శత్రువులకు హెచ్చరిక పంపిస్తాడు. కథలో ప్రైమ్ మినిష్టర్ పాత్ర రైమికా సేన్ ఇండియన్ బిగ్గెస్ట్ క్రిమినల్స్ లో ఒకరైన రాకి భాయ్ ని అంతం చేయాలని డెత్ వారెంట్ జారీ చేస్తుంది. ఆ సీన్ తో కథ మరో లెవెల్ కి వెళుతుందట. రాకీ భాయ్ తన అర చేతుల్లోకి తెచ్చుకున్న కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని లాక్కోవడానికి చాలా మంది విలన్స్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారట. మెయిన్ గా సూర్యవర్ధన్ బ్రదర్ అధీరా నుంచి రాకీ ఎదుర్కొనే ఎదురుదెబ్బలు మాములుగా ఉండవని తెలుస్తోంది. మరోవైపు గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ కమల్ గురు పాండియన్, అలాగే ఆండ్రూ, ఇనాయత్ ఖళీల్ వంటి వారు రాకీ ని స్పెషల్ గా టార్గెట్ చేస్తారట. ఏదేమైనా అంతిమంగా సాడ్ ఎండింగ్ నోట్ తో కేజీఎఫ్-2 ముగుస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి సాడ్ ఎండింగ్ తో ముగిసిన సినిమాలు విజయం సాధించిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.