Begin typing your search above and press return to search.

పెళ్లి ఎందుకు చేసుకోలేదో? చెప్పేసిన స‌దా!

By:  Tupaki Desk   |   13 July 2023 5:34 PM GMT
పెళ్లి ఎందుకు చేసుకోలేదో? చెప్పేసిన స‌దా!
X
'జ‌యం' సినిమా తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన స‌దా తొలి సినిమా తో ఎలాటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఒక్క సినిమా తోనే అమ్మ‌డు బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అటు పై శంక‌ర్ లాంటి లెజెండ్ తోనూ ప‌నిచేసి ఇండియావైడ్ వెలుగు లోకి వ‌చ్చింది. తెలుగుతో పాటు త‌మిళ‌.. హిందీ...క‌న్న‌డ సినిమాలు చేసింది. అయితే ఏ భాష‌ లోనూ అమ్మ‌డు నిల‌దొక్కుకోలేదు.

దీంతో 2018 త‌ర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. అప్ప‌టికే టీవీ షోలు హోస్ట్ చేస్తున్న అమ్మ‌డు అప్ప‌టి నుంచి పూర్తిగా బుల్లి తెర‌కి అంకిత‌మైంది. అయితే ఈ బ్యూటీ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

వ‌య‌సు 40 ఏళ్ల స‌మీపిస్తున్న అమ్మ‌డు ఇంకా పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం లేదు. దీంతో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి త‌న అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌ని...వివాహం చేసుకుని స్వేచ్ఛాయుత జీవితాన్ని వ‌దులుకోవ‌డం ఇష్టం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది.

ఒక వేళ పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు మ‌న‌కి ఎలాంటి వాడు తార‌స‌ప‌డ‌తాడో తెలియ‌దు. అర్దం చేసుకునేవాడు వ‌స్తాడో? రాడో తెలియ‌దు. ఇలాంటి బ‌ల‌మైన సందేహం న‌డుమ పెళ్లి చేసుకుని ఇబ్బంది ప‌డ‌టం క‌న్నా స్వేచ్ఛ‌గా జీవించ‌డం ఉత్తమం అంటోంది. పైగా ఈరోజుల్లో వివాహ బంధం ఎంతో కాలం నిల‌బ‌డ‌టం లేద‌ని గుర్తు చేసింది. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల‌కే ఏదో కార‌ణం తో విడిపోతున్నారు.

ఇలాంటివి పేప‌ర్లో..టీవీల్లో చూసిన‌ప్పుడు చాలా బాధ‌గా అనిపిస్తుంది. ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుని ఉంటారు. ఇప్పుడిలా విడిపోతున్నారు. పిల్ల‌లుంటే వాళ్ల జీవితాలు ఏమైపోతాయ‌ని మ‌న‌సు లో బాధ క‌లుగుతుంది. ఇలాంటివ‌న్ని పెళ్లి అనే అంశం పైనా న‌న్ను మ‌రింత లోతు గా ఆలోచించేలా చేస్తున్నాయి. ఉన్నంత కాలం సంతోషం గా సాగిపోతే చాలు అనిపిస్తుంది' అని అన్నారు.