Begin typing your search above and press return to search.
సదా ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించబ్బా..!
By: Tupaki Desk | 15 Nov 2022 2:30 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సదా కొనసాగింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయం’ మూవీతో సదా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమా నుంచే సదాకు తెలుగులో భారీ అవకాశాలు దక్కాయి. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ సంపాదించుకొని బిజీగా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.
సదా కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లోనూ నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా సదాకు సరైన హిట్ దక్కడం లేదు. దీంతో ఈ భామ ఫేడ్ అవుట్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ.. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ కెరీర్ ముందుకు సాగిస్తోంది.
పలు టెలివిజన్ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. అడపా దడపా స్టేజ్ షోలపై మెరిస్తోంది. అయితే సదా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో పీకలదాకా ప్రేమలో మునిగిందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్లో ఉంది. ఆ ప్రేమ వ్యవహారం వల్లే సదా కెరీర్ ఆ తర్వాత పూర్తిగా గాడిన తప్పిందనే ప్రచారం నడిచింది. ఈ కారణంగానే సదా ఇప్పటి దాకా పెళ్లి చేసుకోలేదనే టాక్ గత కొన్నాళ్లుగా నడుస్తోంది.
మరోవైపు సదా తోటి హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలను సైతం కన్నారు. వారంతా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్నారు. అయితే సదా మాత్రం తనకు 38 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ఇటీవల అడవులకి వెకేషన్ కి వెళ్లిన సదా అక్కడ తీసిన ఓ వీడియోను తాజాగా పోస్ట్ చేసింది. దీనికి ఒక ఎమోషన్ మ్యాటర్ కూడా జత చేయడంతో ఈ పోస్టు కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
‘‘అవసరాల కోసం ఉన్న బంధాల్లో చిక్కుకుపోయి.. ఆ మనుషులు వెళ్ళిపోతారేమోనని ఎందుకు భయపడుతున్నారు.. మనం సన్నిహితులు అనుకునే వాళ్ళు.. మనల్ని అనుకోకపోతే వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది.. మీ జీవితంలో మీకు మీరు మాత్రమే తోడుగా ఉంటారు.. లైఫ్ లోకి ఎంతోమంది వస్తారు.. వెళ్తారు’’ అంటూ ఎమోషన్ అయింది. తప్పుడు మనుషులు.. బలవంతపు బంధాల కోసం మీ జీవితాన్ని వృథా చేసుకోవద్దంటూ సలహా ఇచ్చింది.
ఇలాంటి బంధాల్లో చిక్కుకొని బాధపడే కంటే ఒంటరిగా ఉండటమే మంచిదని సదా అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఈ ముదురు భామ ఎవరి గురించి ఈ ఎమోషన్ పోస్టు పెట్టిందా? అన్న చర్చ అభిమానుల్లో జోరుగా నడుస్తోంది. ఈ పోస్ట్ చూస్తుంటే సదా పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా జీవించేందుకు రెడీ అయిందా? అన్న సందేహాలు కలుగక మానదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.