Begin typing your search above and press return to search.
హీరోయిన్ పేరుతో బూతు బొమ్మలు
By: Tupaki Desk | 8 Aug 2021 7:49 AM GMTసెలబ్రెటీల పేరుతో సోషల్ మీడియాలో బూతు బొమ్మలు షేర్ చేయడం ఈమద్య కొందరు చేస్తున్న పని. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ద్వారా కొందరు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. తాజాగా మలయాళి ముద్దుగుమ్మ సాధికా వేణు గోపాల్ పేరుతో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి అందులో బూతు బొమ్మలను షేర్ చేస్తున్నారట. ఇటీవల ఒక వ్యక్తి సాధికకు సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. మీరు ఎందుకు అలాంటి పొటోలు షేర్ చేస్తున్నారు అంటూ సీరియస్ గానే ఆమెను ప్రశ్నించాడట.
ఆమె అతడి మెసేజ్ కు షాక్ అయ్యింది. నేను బూతు బొమ్మలు షేర్ చేయడం ఏంటీ.. అసలు నేను ఎక్స్ పోజింగ్ విషయంలోనే ఆసక్తి చూపించను. అలాంటి నా అకౌంట్ లో అలాంటి ఫొటోలు ఎందుకు ఉంటాయి అంటూ ఆమె అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడు ఆ సోషల్ మీడియా అకౌంట్ కు సంబంధించిన లింక్ ను షేర్ చేశాడట. సాధిక చూసి షాక్ అయ్యిందట. సాధిక పేరుతోనే ఉన్న ఆ అకౌంట్ డీపీ కూడా ఆమెదే ఉంది. దాంతో ఆమె వెంటనే ఆ అకౌంట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. సోషల్ మీడియాలో ఆ అకౌంట్ ను ఎవరు మెయింటెన్ చేస్తున్నారు అనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సెలబ్రెటీల పేరుతో అకౌంట్స్ ను మెనేజ్ చేయడం ఈమద్య చాలా మంది చేస్తున్నారు. కాని బూతు బొమ్మలు షేర్ చేయడం వల్ల అవతలి వారి పరువు తీసిన వారు అవుతారు. కనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున హీరోయిన్ లతో పాటు హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉన్నారు. వారు తప్పుడు ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో బయట పడటం తప్పదు.