Begin typing your search above and press return to search.
#గుసగుస.. పాపం సల్మాన్ ఎటో వెళ్లిపోతున్నాడు!
By: Tupaki Desk | 9 Dec 2021 6:31 AM GMTప్రియురాలికి స్నేహితురాలికి సన్నని గీత అడ్డు ఉంటుంది. అసలు ప్రియురాలా స్నేహితురాలా? అన్నది కనిపెట్టడమే కష్టం. అంత ఇదిగా కలిసిమెలిసి ఉంటారు బాలీవుడ్ సెలబ్స్. ఒకవేళ ప్రేమకు బ్రేకప్ అయినా కలిసి నటించడం కూడా అంతే కామన్. కెరీర్ కి లవ్వాయణంలో సరిగమలకు లింకేమీ ఉండదు. సల్మాన్ భాయ్.. కత్రిన కైఫ్ మధ్య ఇలాంటి దోస్తీనే ఉందని అభిమాన జనం నమ్ముతారు.
సుదీర్ఘ కాలం సల్మాన్ తో ప్రేమలో ఉన్న కత్రిన కైఫ్ నాలుగేళ్లుగా యూటర్న్ తీసుకుని తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ని పెళ్లాడేస్తుంటే భాయ్ అభిమానులు ఈ సన్నివేశాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకుముందు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ని నమ్మి చాలా కాలం ప్రేమించి చివరికి పెళ్లాడుదామనుకునే సమయంలో బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఐష్ వెళ్లి అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఇటీవల కొన్నేళ్లుగా సల్మాన్ కి స్నేహితురాలిగా మాత్రమే ఉన్న కత్రిన కైఫ్ అతడితో వరస చిత్రాల్లో నటించింది. దీంతో తిరిగి ఆ ఇద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారిందని అంతా భావించారు. బాలీవుడ్ మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి.
అయితే ఇంతలోనే కత్రిన తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ తో ప్రేమలో పడడం నాలుగేళ్లలోనే అతడిని పెళ్లాడేసేందుకు రెడీ అవుతుండడంతో ఇది నిజంగానే భాయ్ కి నిరాశే! అయ్యిందంటూ గుసగుసలాడుకోవడం నెటిజనుల్లో దానిపై డిబేట్ సాగడం చూస్తున్నదే. నేడు రాజస్థాన్ లో కత్రిన- విక్కీ కౌశల్ పెళ్లి గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకలకు సల్మాన్ వెళ్లడం లేదు. అతడు నగరం నుంచి స్కిప్ కొడుతూ ఇలా విచారంగా కనిపించాడు.
ప్రస్తుతం ఆ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. సల్మాన్ ఇంతకీ ఎక్కడికి వెళుతున్నారు? అంటే దబాంగ్ టూర్ పేరుతో రియాద్ కి వెళుతున్నారని గుసగుస వినిపిస్తోంది. ఆసక్తికరంగా కత్రిన పెళ్లికి సెక్యూరిటీగా సల్మాన్ బాడీ గార్డ్ నే పంపించారు. సల్మాన్ గార్డ్ షేరా అతడి బృందం ఈ వేడుకను దగ్గరుండి జరిపిస్తున్నాడు. #గుసగుస.. పాపం సల్మాన్ ఎటో వెళ్లిపోతున్నాడు! అంటూ నెటిజనం విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.