Begin typing your search above and press return to search.
డాక్టర్ ని అయినా కరోనాలో ఏమీ చేయలేకపోయాను!
By: Tupaki Desk | 11 Oct 2021 1:30 AM GMTఇటీవల `లవ్ స్టోరి` చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది సాయిపల్లవి. మరోసారి తనలో ప్రొఫెషనల్ డాన్సింగ్ ట్యాలెంట్ ని ప్రూవ్ చేసింది. `ఫిదా` తర్వాత శేఖర్ కమ్ములా `లవ్ స్టోరి`లో సాయి పల్లవిని ఎంపిక చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం రానా సరసన `విరాటపర్వం`.. నానితో `శ్యాం సింఘరాయ్` చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా కరోనా పాండమిక్ సమయంలో సాయి పల్లవి ప్రజలకు ఎలాంటి సేవలు అందించలేకపోయానని వాపోయింది. మరి అంత మంది హీరోయిన్లు ఉన్నా? వాళ్లెవరికి లేని బాధ్యత సాయిపల్లవికే ఎందుకంటే? ఆసక్తికర సంగతే ఉంది.
సాయి పల్లవి డాక్టరేట్ డిగ్రీని కలిగి ఉంది. అయితే ఈ డిగ్రీ అప్పటికి సాయి పల్లవి చేతికి రాలేదు. అందుకు కారణం సినిమాలే... సాయి పల్లవి చదువుకుంటోన్న సమయంలోనే సినిమాల్లో అవకాశం రావడంతో ఇటు వైపు వచ్చేసింది. ఆ తర్వాత పుస్తకాల వైపు చూసింది లేదు. దాదాపు నాలుగేళ్ల పాటు చదువును పక్కన పెట్టేసింది. అలా తాను డాక్టర్ కావాలన్న కల ఆలస్యమైంది. ఇంతలోనే కరోనా రావడంతో ప్రజలు ఎంతగా విలవిలలాడిపోయారో తెలిసిందే. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా భారీగా డాకర్లను కేంద్ర ప్రభుత్వం భర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాయి పల్లవి కూడా ప్రజలకు సేవ చేయాలనుకుందిట.
కానీ చేతిలో డాక్టర్ పట్టా లేకపోవడంతో వెళ్లలేకపోయానని తెలిపింది. నేను ఎంతగా చేతకాని దానినో నాకు అప్పుడే అర్ధమైంది అంటూ సాయి పల్లవి వాపోయింది. అవసరమైన సమయంలో నా చదువుకు ఎందుకు పనికిరాలేదని విచారం వ్యక్తం చేసింది. ఇటీవలే సాయి పల్లవి తిరుచ్చి వెళ్లి మెడిసిన్ పరీక్షలు రాసొచ్చింది. సాయి పల్లవి యాక్టింగ్ లోనే కాదు..చిన్న నాటి నుంచి చదువులోనూ చాలా తెలివైన విద్యార్ధి. డాక్టర్ కావాలనన్నది ఆమె ఆశయం. చివరికి ఆ కలను కూడా నిజం చేసుకుంది.