Begin typing your search above and press return to search.

బిజినెస్ పరంగా 'క్రాక్' నిర్మాతను సేఫ్ చేసిందా..?

By:  Tupaki Desk   |   7 Jan 2021 2:13 PM GMT
బిజినెస్ పరంగా క్రాక్ నిర్మాతను సేఫ్ చేసిందా..?
X
మాస్ మహారాజ్ రవితేజ సినిమా థియేటర్లోకి వస్తుందంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఈ నెల 9న అలాంటి సీన్ ఏదైనా రిపీట్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే క్రాక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు, సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ బాగానే అమ్ముడైందని తెలుస్తుంది. ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యిందట. 25కోట్ల వరకు అంచనా వేస్తే డైరెక్టర్ డిమాండ్స్ మేరకు 30కోట్లు దాటిందని అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ కూడా పక్కన నెట్టేసి హక్కులతో మంచి బిజినెస్ చేసిందట.

ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఆంధ్రా ఏరియా 8 కోట్లకు, నైజాం ఏరియా 6.8 కోట్లు, సీడెడ్ 2.70 కోట్లకు అమ్ముడయ్యాయట. నాన్ థియేట్రికల్ హక్కులు హిందీ డబ్బింగ్ 11కోట్లు, ఆహా డిజిటల్ హక్కులు 7 కోట్లు, స్టార్ మా సాటిలైట్ హక్కులు 6 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. మొత్తానికి 42 కోట్ల పైనే క్రాక్ బిజినెస్ చేసిందని అంచనా వేస్తున్నారు. అలాగే హీరో పార్టనర్ షిప్ మీద తీసినట్లయితే నిర్మాతకు లాభం వచ్చినట్లే అనుకోవాలి. ఇక క్రాక్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ పొందింది. అలాగే సంక్రాంతికి జనవరి 14న విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే క్రాక్ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని సినీ వర్గాలలో ఫుల్ క్రేజ్ అండ్ బజ్ క్రియేట్ చేసాయి. అంతేగాక క్రాక్ టీమ్ కూడా ఫుల్ ప్రమోషన్స్ చేస్తోంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.