Begin typing your search above and press return to search.

గౌతం స్టైల్ : ట్రైలర్ లో సంగీత ప్రస్థావన..

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:53 AM GMT


హిట్లతో ఫ్లాపులతో సంబంధం లేకుండా గౌతం మీనన్ సినిమాలకోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురుచూస్తూనే వుంటారు. అటు ప్రేమకధలను, ఇటు యాక్షన్ కాప్ స్టోరీలను తనదైన స్టైల్ లో తెరకేక్కిస్తూ తమిళనాటే కాక ఇక్కడ కూడా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. నాగ చైతన్య తొలి హిట్, కెరీర్ బెస్ట్ అయిన ఏం మాయ చేశావే సినిమా గౌతం తెరకెక్కించినదే. ఇప్పటికీ ఈ సినిమాను వందల సార్లు చూసిన ప్రేక్షకులు వున్నారు.

ఈసారి వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం టైటిల్ లో యాక్షనిజాన్ని పండించినా విడుదల చేసిన టీజర్ లో మాత్రం లవ్ యాంగిల్ నే బయటపెట్టారు.

అయితే గౌతం గత ప్రేమకధా చిత్రం 'ఎటో వెళ్ళిపోయింది మనసు' ట్రైలర్ లో కమ్మని ఈ ప్రేమలేఖ పాట ప్రస్థావన తెచ్చి ఇళయరాజాని ప్రశంసించిన గౌతం ఈ సినిమాలో తన ప్రేమికురాలి గురించి హీరో స్నేహితులకు తెలిపే క్రమంలో ఏ.ఆర్ రెహమాన్ 'హోసాన...' అంటూ మరోసారి సంగీత దర్శకుడి విశిష్టని తన ట్రైలర్ లో బంధించాడు.

ఈ సినిమాకు రెహమాన్ అదిరిపోయే స్వరాలను అందించినట్టు టీజర్ చూస్తేనే తెలుస్తుంది. తన సినిమాలలో సంగీత దర్శకులకు పెద్ద పీట వేయడమేకాకుండా విడుదలవుతున్న ఒక్క నిముషం ట్రైలర్ లలో వారి ప్రస్థావన తీసుకురావడం గౌతంకి తన సంగీత దర్శకులపై నున్న ప్రేమకు నిదర్శనం.