Begin typing your search above and press return to search.
పవన్ హీరోగా సాయి ధరమ్ మూవీ పార్ట్ 2
By: Tupaki Desk | 22 Dec 2021 6:35 AM GMTసాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ మూవీకి కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. కాని సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఒక మంచి సబ్జెక్ట్ తో సినిమాను తెరకెక్కించిన దేవ కట్టాను ప్రతి ఒక్కరు అభినందించారు. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు ఇండస్ట్రీలో మరిన్ని రావాలనే అభిప్రాయం ను అభిరుచి ఉన్న ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.
రిపబ్లిక్ సినిమా లో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి.. వాటి వల్ల న్యాయ వ్యవస్థ ఇతర వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చూపించడం జరిగింది. దేవ కట్టా ఒక మంచి మెసేజ్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ లో మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు దేవ కట్టా ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు. రిపబ్లిక్ సినిమా కు వచ్చిన ప్రశంసలు సంతోషాన్ని కలిగించాయి. అందుకు మరోసారి రిపబ్లిక్ తరహా సినిమా చేస్తాను అన్నట్లుగా ప్రకటించాడు. రిపబ్లిక్ 2 సినిమాను పవన్ కళ్యాణ్ తో తీస్తానంటూ కూడా స్వయంగా దేవ కట్టా ప్రకటించాడు.
పవన్ కళ్యాణ్ గారి కోసం కథను సిద్దం చేస్తున్నట్లుగా దేవ కట్టా అధికారికంగా ప్రకటించాడు. సామాజిక అంశాలను టచ్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ను తీయాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. ఆ జాబితాలో దేవ కట్టా కూడా చేరాడు. రిపబ్లిక్ 2 ను పవన్ తో చేయాలని బలంగా కోరుకుంటున్న దేవ కట్టా కు ఆ అవకాశం దక్కేనా అనేది చూడాలి.
పవన్ తో సినిమా అంటే ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే నాలుగు అయిదు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ సినిమా ల తర్వాత అయినా దేవ కట్టాకు ఛాన్స్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మొదట దేవ కట్టా రెడీ చేసే కథకు పవన్ ఓకే చెప్పాలి. అందుకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది.
మొత్తంగా పవన్ కళ్యాణ్ మరియు దేవ కట్టా మూవీ పట్టాలెక్కాలంటే చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అది ఎప్పటి వరకు వస్తుంది.. అసలు వస్తుందా లేదా అనేది చూడాలి. దేవ కట్టా మాత్రం పవన్ తో రిపబ్లిక్ తరహా సినిమా తీసేందుకు మంచి కథ ను తయారు చేసుకోవాలంటూ అభిమానులు కోరుతున్నారు. వీరిద్దరి కాంబో కోసం ఎదురు చూస్తున్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.