Begin typing your search above and press return to search.
వాళ్ళది అది బ్రదర్.. నాది ఇది బ్రదర్
By: Tupaki Desk | 27 Feb 2017 6:55 PM GMT''చెప్పను బ్రదర్'' అని అల్లు అర్జున్ కామెంట్ చేస్తే.. ''ఆపలేను బ్రదర్'' అంటూ సాయిధరమ్ తేజ్ కామెంట్ చేశాడు. మెగా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే రచ్చేంటో అందిరికీ తెలిసిందే. అవతల స్వయంగా మెగాస్టార్ వంటి పెద్దలు మాట్లాడుతున్నా కూడా గౌరవం ఇవ్వకుండా పవర్ స్టార్ అని అరుస్తూనే ఉంటారు. దానితో స్వయంగా చిరంజీవికి కూడా చాలా ఇబ్బందే కలిగింది. అందుకే ఈ యవ్వారంపై అప్పట్లో చిరు విధేయుడు అయిన బన్నీ అలా స్పందించాడు. కట్ చేస్తే సాయిధరమ్ ఇటు చిన్న మావయ్య విధేయుడు కాబట్టి.. మనోడు ఇంకో టైపులో స్పందించాడు.
దీని గురించి మరోసారి మాట్లాడిన సాయిధరమ్ తేజ్.. తాను ఎప్పుడూ కూడా అభిమానులు తన మావయ్య పేరును అరుస్తుంటే వారికి అరవొద్దు అని చెప్పలేనని సెలవిచ్చాడు. మరి మీ మావయ్య నాగబాబు.. అలాగే కజిన్ అల్లు అర్జున్ కూడా అలా అరుస్తుంటే తిట్టారుగా అని ప్రశ్నిస్తే.. ''వారి అభిప్రాయం వారిది. వారి సిట్యుయేషన్లోకి వెళ్ళి నేను కామెంట్ చేయలేను. వారిలా నేను ఆలోచించను నాలా వారు ఆలోచించరు. కాబట్టి వారు అలా అంటే అని ఉండొచ్చు.నేను మాత్రం అలా అనను'' అని చెప్పాడు.
ఇంతకీ మీ మావయ్యల ముగ్గురిలో నీకు ఎవరంటే బాగా ఇష్టం అని అడిగితే.. ''మా ముగ్గురు మావయ్యలూ ఇష్టమే. వారి ముగ్గురిలో ఎవరు లేకపోయినా నేను లేను. అసలు బ్రతికే ఉండేవాడిని కాదు. నేను.. మా అమ్మ.. మా తమ్ముడు.. ఈరోజు ఇలా ఉన్నాం అంటే అది మా మావయ్యల చలవే'' అంటూ సెలవిచ్చాడు మెగా మేనల్లుడు.