Begin typing your search above and press return to search.

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే కష్టం!

By:  Tupaki Desk   |   26 Nov 2017 4:34 PM GMT
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే కష్టం!
X
మీడియం రేంజి సినిమాలతో తెలివిగా చేసుకుంటూ వస్తున్న మెగా మేనల్లుడు ఇటీవల కాలంలో మెల్లమెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తున్నారు. మొన్నమొన్న తన సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన అభిమానులందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించి తన ప్రత్యేకత చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జవాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ తో మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు ముచ్చటించాడు. నిర్మాతకు డబ్బులు రావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పనిసరని... అందుకే తన చిత్రాలన్నీ కమర్షియల్ యాంగిల్ లోనే ఉంటాయని, జవాన్ కూడా అలాంటిదేనని ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

మెగా మేనల్లుడిగా తిరుగులేని బ్యాక్ గ్రౌండ్‌ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ్ తన ఇంటర్వ్యూ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ కీలకం కాదని చెప్పుకొచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే చాన్సులు రావన్నాడు. అయితే... బ్యాక్‌గ్రౌండ్ కారణంగా అదనంగా కొన్ని చాన్సులు రావొచ్చన్నాడు. తాను కూడా హీరోగా ప్రయత్నించే సమయంలో ఎన్నో కష్టాలు పడ్డానని... కేరింత సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్స్‌కు వెళ్లగా, ఆ పాత్ర సూట్ కాదని చెప్పడంతో వెనక్కు వచ్చేశానని చెప్పుకొచ్చాడు.

తన మామయ్య చిరంజీవి తనకు స్పూర్తి అని, ఆయనలోని కష్టించే తత్వం ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. సినీ పరిశ్రమలో ఆయన స్థాపించిన సామ్రాజ్యంలోనే తామంత బతుకుతున్నామని అంగీకరించాడు... పవన్ కల్యాణ్‌ లో కమిట్‌మెంట్, నిజాయితీ అంటే చాలా ఇష్టమని, ఆయన మాట ఇస్తే ఆయన కట్టుబడి ఉంటాడని చెప్పాడు. చరణ్, వరుణ్, అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ... ‘‘అల్లు అర్జున్ హార్డ్ వర్కర్. ప్రతీసారి చాలా విభిన్నంగా ఉండాలని కోరుకొంటాడు. చరణ్ రాయల్ ప్రిన్స్ లాంటివాడు. తండ్రి చిరంజీవి ఇమేజ్‌కు భంగం కలుగకుండా జాగ్రత్త పడుతాడు. వరుణ్ చాలా విభిన్నమైన వ్యక్తి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇకన పనిలో పనిగా తన సినిమా గురించి చెప్తూ.. హీరోయిన్ ది గోల్డెన్ లెగ్ అన్న కామెంట్లను ఆయన తోసిపుచ్చాడు. అందరం కష్టపడి సినిమా చేస్తే అమ్మాయి ఒక్కదానికే క్రెడిట్ ఇస్తే ఒప్పుకోనన్నాడు. అయితే... మెహ్రిన్ మంచి హీరోయిన్ అని చెప్పాడు.