Begin typing your search above and press return to search.
ఫిబ్రవరి 14.. తేజు జీవితంలో ఒక విషాదం
By: Tupaki Desk | 19 Feb 2017 1:09 PM GMTఫిబ్రవరి 14 అనగానే కుర్రాళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాస్త లేడీ ఫాలోయింగ్ ఉన్న వాళ్లందరూ ఆ రోజును చాలా ఎంజాయ్ చేస్తారు. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోకు ఆ రోజు ఇంకా స్పెషల్ అయ్యుండొచ్చని అనుకుంటాం. కానీ ఆ రోజును తలుచుకుంటే తనకు కళ్లల్లో నీళ్లొచ్చేస్తాయంటుంటున్నాడు తేజు. ఫిబ్రవరి 14న తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చనిపోయాడని.. అందుకే ఆ రోజున తాను చాలా విచారంగా ఉంటానని తేజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘‘నేను ఏ రోజూ వేలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ రోజు నాకు బాధాకరమైన రోజే. 15 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న నా ఫ్రెండు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ రోజు చాలా విచారంగా ఉంటాను. ఆ రోజు మా స్నేహితులందరం కలుస్తాం. ఓ కాఫీ తాగి.. కాసేపు మౌనం పాటించి ఇంటికి వెళ్లిపోతాం’’ అని సాయిధరమ్ తెలిపాడు.
ఈ ఇంటర్వ్యూలో తనకు హార్రర్ సినిమాలంటే చచ్చేంత భయం అని ఆసక్తికర విషయం చెప్పాడు సాయిధరమ్. బేసిగ్గా తాను హార్రర్ సినిమాలు చూడనని.. అలాంటి సినిమాల్లో నటించే ఉద్దేశం కూడా తనకు లేదని సాయిధరమ్ తెలిపాడు. ‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కన్జూరింగ్.. ద ఎగ్జాసిస్ట్.. ఇలాంటి సినిమాలు నా వల్ల కాదు. దరిద్రం కాకపోతే... డబ్బులిచ్చి మరీ భయపడటం ఏంటి? జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తానన్నా నేను హారర్ సినిమాలు చేయను’’ అని సాయిధరమ్ తేల్చి చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/