Begin typing your search above and press return to search.
బన్నీతో గొడవ గురించి తేజ్ ఏమన్నాడంటే..
By: Tupaki Desk | 18 April 2019 11:24 AM GMTవరుసగా ఆరు ఫ్లాప్ ల తర్వాత సాయి ధరమ్ తేజ్ కు 'చిత్రలహరి' చిత్రంతో సక్సెస్ దక్కింది. అది ఏ స్థాయి సక్సెస్ అనే విషయం పక్కన పెడితే ఆరు వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న తేజ్ కు చాలా రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇటీవలే విడుదలైన చిత్రలహరి చిత్రంకు మంచి స్పందన దక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శిని మరియు నివేదా పేతురాజ్ లు హీరోయిన్స్ గా నటించారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ మీడియా సంస్థలకు చాలా ఆనందంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ్ మాట్లాడుతూ... సుప్రీం తర్వాత నన్ను కొందరు మిస్ గైడ్ చేశారని, తప్పుడు సలహాలు ఇచ్చారని టాక్ వచ్చింది. కాని సుప్రీం తర్వాత చేసిన ప్రతి సినిమా నిర్ణయం కూడా నాదే. మంచి కథలను ఎంచుకోలేక, మంచి సబ్జెక్ లు ఎంచుకోలేక పోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వచ్చాయి. ఇందులో ఎవరి తప్పు లేదు అన్నాడు. నాకు ఫ్లాప్ ఇచ్చిన ప్రతి దర్శకుడు కూడా సారీ చెప్పాడు. ముఖ్యంగా వినాయక్ గారు నీకు మంచి హిట్ ఇవ్వలేక పోయాను సారి తేజ్ అంటూ పలు సందర్బాల్లో అనే వారు. కష్టపడి పని చేయి తప్పకుండా సక్సెస్ వస్తుందని వినాయక్ గారు ప్రోత్సహించారు.
ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు సాయి ధరమ్ తేజ్ కు మద్య విభేదాలు ఉన్నాయని, గొడవలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో ఎంత నిజం ఉందని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించగా అదంతా కూడా కేవలం పుకార్లు మాత్రమే. నేను ఎక్కువగా రామ్ చరణ్, వరుణ్ తేజ్ లతో ఎక్కువగా కలుస్తాను. బన్నీతో చాలా అరుదుగా కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడు స్టైల్ గురించి, సినిమాల ఎంపిక గురించి మాట్లాడుకుంటాం. మా మద్య ఎలాంటి విభేదాలు లేవు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మా మద్య ఎందుకు విభేదాలు ఉంటాయంటూ తేజ్ గొడవపై క్లారిటీ ఇచ్చాడు.