Begin typing your search above and press return to search.

బ‌న్నీ, సాయిధ‌ర‌మ్.. అక్క‌డ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌!

By:  Tupaki Desk   |   22 Aug 2016 9:22 AM GMT
బ‌న్నీ, సాయిధ‌ర‌మ్.. అక్క‌డ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌!
X
ఈ పుట్టిన రోజు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్ర‌త్యేక‌మైంది! గ‌త ఏడాది చిరంజీవి ష‌ష్టి పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది 150 చిత్రంలో న‌టిస్తున్నారు. పైగా, చాన్నాళ్ల త‌రువాత మెగా రీ ఎంట్రీగా వ‌స్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు! కాబ‌ట్టి చిరంజీవి 61వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను మెగా లెవ‌ల్లోనే ఉండేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్‌ లోని శిల్ప క‌ళా వేదిక‌లో జ‌రుగ‌నున్న పుట్టిన రోజు వేడుక‌ల‌కు మెగా ఫ్యామిలీ హాజ‌రు అవుతుంది. అయితే, ఈ వేడుక‌ల్లో మెగా వార‌సులు అల్లు అర్జున్‌ - సాయిధ‌ర‌మ్ తేజ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నార‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ విష‌యంలో ఇద్ద‌రూ రెండు ర‌కాలుగా వ్యాఖ్యానించారు క‌దా!

ఒక ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ గొడ‌వ చేస్తుంటే... అల్లు అర్జున్ మంద‌లించి - లైట్ గా క్లాస్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలో చెప్పాడు. ఎక్క‌బ‌డితే అక్క‌డ గోల చెయ్యొద్దంటూ సున్నితంగా సూచించాడు. ఇంకో ఫంక్ష‌న్‌ లో సాయిధ‌ర‌మ్ ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడాడు. ఫ్యాన్స్‌ తో క‌లిసి నినాదాలు చేశాడు. అయితే, ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌నూ ప‌ర‌స్ప‌ర విరుద్ధమైన‌విగా చిత్రించేందుకు కొన్ని విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. సాయిధ‌ర‌మ్‌ - బ‌న్నీల మ‌ధ్య అభిప్రాయ‌ బేధాలుగా వీటిని కొంత‌మంది చూస్తున్నారు. నిజానికి ఈ ఇద్ద‌రి మ‌ధ్యా అలాంటి విభేదాలు ఎందుకు ఉంటాయి చెప్పండీ..? ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో భేదాభిప్రాయాలు ఉంటాయా..? ఇద్ద‌రు హీరోలూ ఆ కామెంట్లు వేర్వేరు సంద‌ర్భాల్లో చేసిన‌వి. వాటిని ప‌క్క‌ప‌క్క‌న పెట్టి భూత‌ద్దంలో చూస్తేనే వేరే అభిప్రాయం క‌లుగుతుంది.

అయితే, ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్‌ - బ‌న్నీలు మెగాస్టార్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు వ‌స్తున్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలామందే వ‌స్తారు. ఈ ఇద్ద‌రూ మాట్లాడుతున్న‌ప్పుడు అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కాస్త విజ్ఞ‌త ఉన్న‌వారు ఎవరైనా ఇదో స‌మ‌స్య‌గానో, వివాదాస్ప‌ద అంశంగానో చూడ‌ర‌నే చెప్పాలి!