Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ నుంచి సుప్రీమ్ హీరో బ్యాక్
By: Tupaki Desk | 31 July 2018 7:09 AM GMTఎంత మెగా బ్రాండ్ ఉన్నా వరసగా ఆరు పరాజయాలు పలకరిస్తే తట్టుకోవడం కష్టం. అందులోనూ ఒకదాన్ని మించి ఒకటి ప్రేక్షకుల తిరస్కారానికి గురైనప్పుడు కొంత ఆత్మపరిశీలన అవసరమవుతుంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఈ స్టేజి లోనే ఉన్నాడు. మేకోవర్ తో పాటు పర్సనల్ రెస్ట్ కోసం అమెరికాలో ఉన్న తేజు ఆగస్ట్ నెలాఖరుకు ఇండియా రానున్నాడు. రాగానే సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారం నుంచి కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి బ్యానర్ తీయబోయే సినిమా కోసం సెట్స్ లోకి అడుగు పెడతాడు.
సాలిడ్ గా ఒక స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి ధరమ్ తేజ్ అది కిషోర్ తిరుమల సినిమా ద్వారా వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కున్న ఇమేజ్ కూడా ఇక్కడ ప్లస్ అవుతుంది కనక అభిమానులకు కూడా దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. మెగా బ్లాక్ బస్టర్ రంగస్థలం నిర్మాతలు వీళ్ళే కావడం ఇక్కడ సెంటిమెంట్ గా ఫీలవ్వడానికి మరో కారణం. ఇక కిషోర్ తిరుమల కూడా హిట్టు కోసం తపిస్తున్న వాడే. మొదటి సినిమా నేను శైలజ ఎంత పేరు తీసుకొచ్చినప్పటికీ రెండోది ఉన్నది ఒకటే జిందగీ ఊహించని విధంగా నిరాశ పరిచింది. తాను ఎక్కడ పొరపాట్లు చేసాడో తెలుసుకునే అవకాశం కల్పించింది. అందుకే తేజు సినిమాలో ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం.
దీనికి చిత్రలహరి అనే పేరు పరిశీలనలో ఉంది. ట్యాగ్ లైన్ గా బార్ అండ్ రెస్టారెంట్ అని పెట్టారట. ఒకప్పుడు దూరదర్శన్ లో సినిమా పాటలతో వచ్చే పాపులర్ ప్రోగ్రాం గా చిత్రలహరికి గొప్ప పేరుంది. క్యాచీగా ఉండటంతో పేరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో దీని వైపు మొగ్గు చూపిస్తున్నట్టు టాక్. వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే వచ్చే నెల దాకా వెయిట్ చేయాల్సిందే .